
26 సంవత్సరాల వయసు కలిగిన బాక్సర్ విజేందర్ ఎక్సెల్ ఎరీనాలో జరిగిన తొలి రౌండ్‌లో 3-3తో సమానంగా నిలిచిన విజేందర్ రెండో రౌండ్లో 5-7తో వెనుకబడిపోయాడు. ఇక చివరి రౌండ్‌లో కాస్త కోలుకున్నా ప్రత్యర్ది అబ్బోస్ పంచ్‌లకు నిలబడలేకపోయాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన విజేందర్ లండన్ లో అంతకన్నా మెరుగైన పతకం తెస్తాడని అశించిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిల్చాడు.
మరోవైపు ఎక్సెల్ ఎరెనాలో బాక్సింగ్ మహిళ ప్లయి్ వెయిట్ (51 కేజీ) క్వార్టర్ ఫైనల్లో మేరీ కామ్ 15- 6తో మరోవా రహాలీ(ట్యునీసియా)పై ఘన విజయం సాధించి సెమీస్ లోకి ప్రవేశించడంతో... బాక్సింగ్‌లో భారత్‌కు పతకాన్ని అందించనుంది. తొలిసారి లండన్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ ప్రవేశపెట్టిన తోలిసారే భారత్‌కు పతకం ఖాయం చేసింది. బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్లో ఓడిపోయిన ఇద్దరు క్రీడాకారులకు కాంస్య పతకం ప్రదానం చేస్తారు. దీంతో మేరీ కామ్‌కు పతకం ఖాయమైనట్లే.
తెలుగు వన్ఇండియా