Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కశ్యప్‌కు అర్జున.. విజయ్, యోగేశ్వర్‌లకు ఖేల్‌రత్న

kashap
న్యూఢిల్లీ, ఆగస్టు 20: క్రీడల్లో దేశం తరుపున ఇచ్చే అత్యున్నత పురస్కారం 'రాజీవ్‌గాంధీ ఖేల్‌ర‌త్న' అవార్డు ఈ సంవత్సరం ఇద్దరికి లభించింది. ఇటీవల ముగిసిన లండన్ ఒలంపిక్స్‌లో రజతం సాధించిన షూటర్ విజయ్ కుమార్, కాంస్యం సాధించిన రెజ్లర్ యోగేశ్వర్ దత్‌లకు సంయుక్తంగా ఈ అవార్డుని ప్రకటించారు. వీరితో పాటు 25 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన షూటర్ రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ నేతృత్వంలోని కమిీట సిఫారసు చేసిన అవార్డుల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ అదివారం అమోద ముద్ర వేసింది.

కొన్ని అసాధారణ పరిస్థితుల్లో నిబంధనలను సడలించే అవకాశం ఉండటంతో ఈసారి ఇద్దరికి ఖేల్‌ర‌త్న అవార్డును ప్రకటించామని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అర్జున జాబితాను 15 నుంచి 25కు పెంచామని పేర్కొంది.

ఖేల్‌ర‌త్న అవార్డు లభించిన ఆటగాళ్లకు మెడల్ తో పాటు చెరో రూ.7.5 లక్షలు, అర్జున అవార్డీలకు మెమొంటో, రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని బహుకరిస్తారు. ఈనెల 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆటగాళ్లకు ఈ అవార్డులను అందచేయనున్నారు.

ఖేల్‌ర‌త్న అవార్డు: విజయ్ (షూటింగ్), యోగేశ్వర్ (రెజ్లింగ్).

అర్జున అవార్డు: యువరాజ్ సింగ్ (క్రికెట్), సర్దార్ సింగ్ (హాకీ), యష్‌పాల్ సోలంకీ (జూడో), అనూప్ కుమార్ (కబడ్డీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్నురాజ్ సింగ్, ఓంకార్ సింగ్, జైదీప్ కర్మాకర్ (షూటింగ్), దీపికా పల్లికల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్‌లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీతా పోగట్ (రెజ్లింగ్), బిమల్‌జిత్ సింగ్ (వుషు), దీపా మల్లిక్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్), రామ్‌కరణ్ సింగ్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్), దీపిక, బొంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవితా రౌత్ (అథ్లెటిక్స్), అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్ (బ్యాడ్మింటన్), ఆదిత్య మెహతా (బిలియర్డ్స్), వికాస్ కృషన్ (బాక్సింగ్), .

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+