Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంటర్నెట్‌లో హాల్ చల్ చేస్తున్న 'పింకీ' నగ్న వీడియో

Pinki Pramanik
కోల్ కత్తా, జూన్ 3: పింకీ ప్రామాణిక్ ఒక అథ్లెట్ కంటే కూడా రేప్ కేసు ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఈ ఉదంతం రోజు రోజుకీ మరో మలుపు తిరుగుతుంది. పింకీ ప్రామాణిక్ లింగ నిర్దారణ పరీక్షల సందర్బంగా ఆమె నగ్నంగా ఉన్న వీడియో క్లిప్ ఇప్పడు ఇంటర్నెట్‌లో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనియాంశం అయింది. 29 సెకన్ల నిడివితో ఉన్న ఈ ఎంఎంస్ క్లిప్ ఆన్‌లైన్‌లో హాల్ చల్ సృష్టిస్తుంది.

కోల్‌కతా సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పింకీకి తొలుత లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ క్లిప్‌ను చేశారని ఆరోపణలు వినపడుతున్నాయి. 'నాకు కూడా ఈ విషయం తెలిసింది. నేనింకా ఆ వీడియోను చూడలేదు. ఇలాంటి పనులకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ విషయమై మేము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిఉంది' అని పింకీ తరఫు న్యాయవాది తుహిన్ రాయ్ అన్నారు.

అంతక ముందు లింగ నిర్ధారణ జరపడానికి అవసరమైన సదుపాయాలు బారాసత్ ప్రభుత్వ ఆస్పత్రిలో లేవని, అందువల్ల ఈ కేసును కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రికి నివేదించాలని ఉత్తర 24 పరగణాల జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోర్టుకు తెలియజేసారు.

పింకీ ప్రామ్నిక్ అందరూ అనుకుంటున్నట్లు మహిళ కాదని, పురుషుడని, అందుకే తనపై అత్యాచారం చేసాడంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై పింకీకి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఈ నెల 29వ తేదీలోగా నివేదిక సమర్పించాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

అసలు ఎవరీ పింకీ ప్రామాణిక్..?

పింకీ ప్రామాణిక్‌ భారత మహిళా అథ్లెట్. పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనెవెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది.

ఇటీవలే ఈమె పై రేప్ కేసు నమోదైంది. అత్యంత ఆశ్చర్యకరంగా, పింకీ మహిళ కాదని, పురుషుడనీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్రాగుటీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎంతోకాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన పింకీ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను బలాత్కరించినట్టు ఆరోపించింది.

ప్రతిభగల అథ్లెట్‌గా గుర్తింపు పొందిన పింకీ మహిళ కాదని ఇప్పుడు ఫిర్యాదు అందడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పింకీ మహిళ కాదని, తప్పుడు సర్ట్ఫికెట్లతో మహిళల విభాగంలో పోటీపడినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని భారత అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేసింది. కాగా, పింకీపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. 2004 నవంబర్ 22న నాదియాలో కొంతమంది స్థానికులు ఆమె బ్యాగును దొంగిలించారు.

అందులో తుపాకీ కనిపించడంతో ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో ఆమెపై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదైంది. ఇంతకీ పింకీ మహిళనా లేక పురుషుడా అన్నది తేలాల్సి ఉంది. బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు రుజువైతే, మన దేశంలో ఒక పురుషులు తప్పుడు సమాచారమిచ్చి మహిళల విభాగంలో పోటీ పడిన తొలి కేసుగా నమోదవుతుంది.

ఇలావుంటే, పింకీలో పురుషులకు ఉండే హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని బెంగాల్ అథ్లెటిక్స్ సంఘం అధికారులు తెలిపారు. దోహా ఆసియా గేమ్స్ తర్వాత ఆమె అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పురుషుల హార్మోన్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఒక మహిళా అథ్లెట్‌ను పోటీ నుంచి తొలగించడంగానీ, మహిళల విభాగంలో పోటీ చేయరాదని నిషేధించడంగానీ జరగదని స్పష్టం చేశారు.

దీనితో పాటు ఆసియా కామన్‌వెల్త్ స్వర్ణ పతక విజేత అయిన అథ్లెట్ పింకీ ప్రామాణిక్‌‌ను తూర్పు రైల్వే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. అత్యాచార యత్నం ఆరోపణలతో పోలీసులు ఈ నెల 14వ తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం పింకీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పింకీపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంది. టికెట్ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న పింకీ ప్రామాణిక్‌ను సస్పెండ్ చేసినట్లు తూర్పూ రైల్వే అధికార ప్రతినిధి సమీర్ గోస్వామి చెప్పారు.

సర్వీసు నిబంధనల ప్రకారం ఓ ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అతను సస్పెన్షన్‌కు గురవుతాడని ఆయన చెప్పారు. శుక్రవారం పింకీ ప్రామాణిక్‌కు జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. క్రీడాకారుల కోటా కింద పింకీకి తూర్పు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. లింగం విషయంలో నేరం చేసినట్లు రుజువైతే పింకీ ఉద్యోగం ఊడుతుంది. పింకీ సాధించిన పతకాలు కూడా వెనక్కి తీసుకుంటారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+