
లండన్ ఒలింపిక్స్‌లో 100 మీ. విభాగంలో ఈ సారి ఉసేన్ బోల్ట్‌ను ఫేవరేట్‌గా పరిగణించలేమని అథ్లెటిక్స్ దిగ్గజం కార్ల్ లూయిస్ వ్యాఖ్యానించాడు. బోల్ట్‌కు ఇతర అథ్లెట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అతను అన్నాడు. ముఖ్యంగా అమెరికా అథ్లెట్లు లండన్‌లో జమైకా చిరుతలను అధిగమిస్తారని లూయిస్ జోస్యం చెప్పాడు. 'బోల్ట్, బ్లేక్ మధ్య పోరాటం గురించే అందరూ చర్చిస్తున్నారు.
అయితే నేను దానిని దాటి ఆలోచిస్తున్నాను. ఈసారి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. జమైకాను అధిగమించి అమెరికా ఎక్కువ పతకాలు గెల్చుకుంటుందని నా విశ్వాసం' అని ఒలింపిక్స్‌లో 9 స్వర్ణాలు నెగ్గిన కార్ల్ లూయిస్ అభిప్రాయ పడ్డాడు. ఒలంపిక్స్సందర్బంలో లండన్‌లోని ఓ వీధిలో జమైకా స్టార్ స్ప్రింటర్ బోల్ట్ చిత్రాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
ఇక బోల్ట్ మాట్లాడుతూ డబుల్ టైటిళ్లను తిరిగి సాధించడానికి సిద్దంగా ఉన్నాను. నిజానికి నేను ఎల్లప్పుడూ సిద్దమే. ఇటీవల నాకు కొద్దిపాటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు సిద్దంగా ఉన్నాను. గెలుపైనే నా దృష్టంతా. ప్రాక్టీస్‌లో నడుం కొద్దిగా బాధించడంతో తొడకండరం పట్టేసింది. గత రెండున్నర వారాలుగా శిక్షణలో పాల్గొంటున్నాను.. ప్రస్తుతం అంతా బాగుందని ఇంటర్యూలో తెలిపాడు.
తెలుగు వన్ఇండియా