
అంతకుముందే అతడిని అందరూ దిగ్గజం అని కొనియాడుతున్నారు. అయితే తాను రెండు టైటిళ్లను నిలబెట్టుకున్న తర్వాతే దిగ్గజ టైటిల్‌కు అర్హుడునని బోల్ట్ ముందే ప్రకటించాడు. అదే చేసి చూపించాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగన ఫైనల్లో జమైకా జట్టు 36.84 సెకన్లలో రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అమెరికా 37.04 సెకన్లలో పూర్తి చేసి రజతం నెగ్గింది.
కాగా ఈ జమైకా చిరుత బోల్ట్ గాయాల బారిన పడడం, ఒలింపిక్స్ ట్రయల్స్‌లో బ్లేక్ జోరు చూసిన తర్వాత 200 మీటర్ల పోటీ బోల్ట్‌కు కీలకం కాబోతోందని పదే పదే చెప్పారు. దానిని బోల్ట్ కూడా అంగీకరించాడు కూడా. తన కన్నా బ్లేక్ తీవ్రంగా కృషి చేశాడని ఈ సందర్భంగా బోల్ట్ చెప్పాడు.