Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉసేన్ బోల్డ్ రొమాన్స్

Usain Bolt had secret dates with Brit model during London 2012
లండన్: లండన్ ఒలింపిక్స్‌లో ట్రిపుల్ డబుల్ సాధించి చరిత్ర సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆరోజు రాత్రి విందు వినోదాల్లో మునిగి తేలాడు. ఐతే ఆ విందు పార్టీలో జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ 22 ఏళ్ల బ్రిటిష్ మోడల్ మెగన్ ఎడ్వర్డ్స్‌తో అత్యంత సాన్నిహిత్యంగా మెలగడం అందిరిని ఆకర్షించింది. కేవలం ఆ ఒక్క రాత్రే కాకుండా ఒలింపిక్స్ కోసం లండన్‌లో అడుగు పెట్టినప్పటీ నుండి చివరి రోజు వరకు ఆమెతో డేటింగ్ చేసినట్లు సమాచరం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒలింపిక్స్ ముందు జమైకా టిమ్ కిట్ కోసం మోడల్ మెగన్ ఎడ్వర్డ్స్‌తో కలిసి ఉసేన్ బోల్ట్ క్యాట్ వాక్ కూడా చేశాడు. ఆ తర్వాత మెగన్ ఎడ్వర్డ్స్‌ నుండి ఫోన్ నెంబర్ తీసుకోని ఫోన్ సంభాషణలతో మరింతి చేరువయ్యారని సమాచారం. ఒలంపిక్స్ ముగిసిన ఇన్ని రోజుల తర్వాత వీరిద్దరి ఫోటోతో పాటు సన్నిహితంగా మెలిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఓ మోడలే కాదు డార్ట్‌ఫోర్డ్ హర్రిస్ అథ్లెటిక్స్ క్లబ్‌కు చెందిన జూనియర్ అథ్లెట్. బోల్ట్ మనసును దోచిన మెగన్ అతన్ని మళ్లీ ట్రిపుల్ చాంపియన్‌ను చేసింది. గతంలో ఉసేన్ బోల్ట్ చాలా మందితో ప్రేమాయణం కొనసాగించాడు.

పరుగుల యంత్రం ఉసేన్ బోల్ట్ లండన్ ఒలింపిక్స్‌లో రికార్డ్ సృష్టించాడు. 100, 200 మీటర్లలో వరుసగా బీజింగ్ ఒలింపిక్స్‌లో, తాజా లండన్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం గెలుచుకున్న బోల్ట్... 4X100 మీ. రిలేలోనూ స్వర్ణం సాధించి వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన ఘనత సాధించాడు.

బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా బోల్ట్‌కు 100 మీ., 200మీటర్ల పరుగు పందెంలో స్వర్ణాలు దక్కాయి. తద్వారా స్ప్రింట్స్ (100మీ., 200మీ.)లో కార్ల్ లూయీస్ (3 స్వర్ణాలు, 1 రజతం) నెలకొల్పిన అత్యధిక స్వర్ణాల రికార్డును కూడా బోల్ట్ అధిగమించాడు. తాజా విజయంతో కెరీర్‌లో ఓవరాల్‌గా బోల్ట్ ఐదో ఒలింపిక్ స్వర్ణాన్ని నెగ్గగా...స్ప్రింట్‌లో మాత్రం ఇది నాలుగోది. మరో పసిడిని బీజింగ్‌లో 4/100 మీ. రిలేలో గెలిచిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+