Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లెజెండ్ కావాలంటే 200 మీటర్లలోనూ గెలవాలి: బోల్ట్

Usain Bolt
లండన్, ఆగస్టు 7: భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్దరాత్రి ఒలింపిక్స్‌లో 100మీటర్ల రేసులో జమైకా చిరుతగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ 9.63 సెకన్లతో లక్ష్యాన్ని పూర్తిచేసి తన రికార్డుని తానే బద్దలు కొట్టడంతో పాటు చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. బీజింగ్‌లో తాను నెలకొల్పిన రికార్డు (9.69 సె.)ను బద్దలుకొట్టాడు. సంచలనం సృష్టిస్తాడనుకున్న జమైకన్ యొహాన్ బ్లేక్ 9.75 సెకన్లతో తన అత్యుత్తమ రికార్డును నమోదు చేసి రజతంతో సంతృప్తి చెందాడు.

తొలుత ఉసేన్ బోల్ట్ నిదానంగా రేసు ఆరంభించగా... మొదట టైసన్ గే ఆధిక్యంలో ఉన్నాడు. 50 మీటర్లు పూర్తయ్యాక బోల్ట్ విశ్వరూపం ప్రదర్శించాడు. తోటి క్రీడాకారులనుఒక్కసారిగా వెనక్కినెట్టి ముందుకువచ్చాడు. అంతే... ఫినిషింగ్ లైన్ దాటిపోయాడు. 80,000 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన ఒలింపిక్ స్టేడియం బోల్ట్ నామస్మరణతో మార్మోగిపోయింది. దీంతో జమైకా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

100మీటర్లు పరుగు అనంతరం బోల్ట్ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో అందర్నీ ఆకర్షించేవి అథ్లెటిక్స్. వాటి కోసం నేను కూడా ఆత్రుతగా ఎదురుచూశాను. అథ్లెటిక్స్ తర్వాత స్విమ్మింగ్ పోటీలుకూడా నాకెంతో ఇష్టం. వరుసగా పతకాలు సాధించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచినందుకు ఫెల్ప్స్‌కు నా అభినందనలు. అలాగే టెన్నిస్ సెమీస్ విజయం కోసం నాలుగున్నర గంటలు పోరాటం చేసిన ఫెడరర్ స్ఫూర్తి అద్భుతం. ఈ దిగ్గజాలిద్దరికీ హ్యాట్సాఫ్ అని అన్నాడు.

నా నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన రావాలని వెన్నుతట్టారు. పెద్ద టోర్నీల్లో విజయాలు నాకు అలవాటే. అయితే ఒలింపిక్ సన్నాహకాల సందర్భంగా ఓ రోజు సహచరుడు బ్లేక్ నా తలుపు తట్టాడు. 'ఉసేన్... ఇది ఒలింపిక్ సంవత్సరం' అంటూ నన్ను అప్రమత్తం చేశాడు. అతడి స్ఫూర్తికి నేను ఆశ్చర్యపోయా. చాలా మంది నా ప్రతిభను సందేహించారు. కానీ ప్రపంచంలో నేనే అత్యుత్తమం అని చూపాలనుకున్నా. నేను లెజెండ్ కావాలంటే 200 మీటర్లలోనూ గెలవాలి. అప్పటిదాకా ఆ బిరుదుతో నన్ను పిలవకండని అన్నాడు.

ఉసేన్ బోల్ట్ వ్యక్తిగతం:

పేరు: ఉసేన్ బోల్ట్
పుట్టిన తేదీ: 21 ఆగస్టు 1986
పుట్టిన స్దలం: ట్రెలావ్నీ, జమైకా
నివాసం: కింగ్ స్టన్, జమైకా
ఎత్తు: 6 అడుగుల 5 అంగుళాలు
బరువు: 94 కేజీలు

ఉసేన్ బోల్ట్ పురస్కారాలు:

'ఐఏఏఎఫ్' వార్షిక అత్యుత్తమ అథ్లెట్-2008, 09
'లారెస్' ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుడు-2009, 10
'బీబీసీ' విదేశీ అత్యుత్తమ క్రీడాకారుడు-2008,09

ప్రపంచ రికార్డులు:

9.58 సెకన్లు (100 మీటర్లు-బెర్లిన్, 2009)
19.19 సెకన్లు (200మీ.-బెర్లిన్, 2009)
37.04 సెకన్లు (4/100 మీ.రిలే, 2011)

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+