నాలుగేళ్ల తర్వాత రెండోసారి క్వార్టర్ ఫైనల్‌కు ఫెర్రర్

వర్షం కారణంగా ఏడు గంటలకు పైగా సాగిన ప్రీ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ ఫెర్రర్ 7-5, 7-6 (7-2), 6-4తో పదమూడవ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. ఈ విజయం వల్ల నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు మొదలైన ఈ మ్యాచ్ అంతరాయాల కారణంగా రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ముగిసింది.
వర్షం చాలా ఇబ్బంది కలిగించింది. ఐతే అభిమానులు ఓపికతో ఎంతో సహనంగా కూర్చోని మ్యాచ్‌ని తిలకించారు. వారికోసమే ఈ మ్యాచ్‌ను గెలవాలనుకున్నానని మ్యాచ్ తర్వాత డేవిడ్ ఫెర్రర్ వ్యాఖ్యానించాడు. 2007లో యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరిన ఈ స్పెయిన్ స్టార్ ఈసారి క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ టిప్సరెవిచ్ (సెర్బియా) లేదా 19వ సీడ్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)తో తలపడతాడు.
తెలుగు వన్ఇండియా
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications