Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

36 యేళ్ల తర్వాత స్వర్ణం.. అదిరిపోయే నజరానాలు

Keshorn Walcott
పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్): లండన్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఛాంపియన్ కెష్రాన్ వాల్కాట్‌‌కు ట్రినిడాడ్ అండ్ టొబాగో బ్రహ్మరథం పట్టింది. 36 సంవత్సరాల తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోకు తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవడంతో దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. 19 సంవత్సరాల వయసు కలిగిన కెష్రాన్ వాల్కాట్‌‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయం కితకితలాడింది. అంతేకాకుండా కెష్రాన్ వాల్కాట్‌‌కు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం అద్బుతమైన నగదు ప్రోత్సహాకాలను ప్రకటించింది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం వాల్కాట్‌‌కు రూ.కోటి నగదుతో పాటు అత్యంత ఖరీదైన ప్రాంతంలో సుమారు రూ. 2 కోట్లు విలువ చేసే ఇంటిని కానుకగా ప్రకటించింది. లండన్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తర్వాత వాల్కాట్‌ 10 మంది సభ్యుల బృందంతో దేశానికి తిరిగి వచ్చాడు. దీంతో అథ్లెట్లకు స్వాగతం పలకడానికి వచ్చిన అభిమానులనుద్దేశించి ప్రధానమంత్రి కమ్లా పెర్సద్ బిసెసర్ ప్రసంగించారు.

ఈమె మాట్లాడుతూ వాల్కాట్‌‌కు నగదు, ఇంటితో పాటు అతని స్వగ్రామంలో టోకోలో 20 వేల చదరపు అడుగుల స్దలాన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మా కలల్ని నిజం చేసినందుకు గాను కరీబియన్ ఎయిర్ లైన్స్ విమానానికి కెష్రాన్ వాల్కాట్‌ పేరు పెడతాం. దేశంలో చరిత్రాత్మకమైన లైట్ హౌస్‌ను కూడా అతని పేరుతోనే పిలుస్తామని ఆమె ప్రకటించారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+