
ఇక రెజ్లింగ్ ఈవెంట్ సోమవారమే మొదలైనప్పటికీ భారత రెజ్లర్లు పాల్గొననున్న బౌట్‌లు ఈరోజు నుండి ప్రారంభమవుతున్నాయి. తొలుత మహిళల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో 2010 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత గీత ఫోగట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆ తర్వాత శుక్రవారం అమిత్ కుమార్ (55 కేజీలు)... నర్సింగ్ యాదవ్ (74 కేజీలు); శనివారం యోగేశ్వర్ దత్ (60 కేజీలు).... క్రీడల ఆఖరిరోజైన ఆదివారం సుశీల్ కుమార్ (66 కేజీలు) పోటీపడనున్నారు.
లండన్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనే గురువారం నాటి షెడ్యూల్:
అథ్లెటిక్స్:
మహిళల 800 మీటర్ల సెమీస్
టింటూ లూకా
భారత కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలకు
మహిళల హైజంప్ క్వాలిఫయింగ్
సహానా కుమారి
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు
రెజ్లింగ్:
మహిళల 55 కేజీల ఫ్రీస్టయిల్ ప్రి క్వార్టర్ప్
గీత X తోన్యాలిన్ (కెనడా)
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.55 గంటలకు
గమనిక: ఈఎస్‌పీఎన్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
తెలుగు వన్ఇండియా