Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్ ఒలంపిక్స్.. జ్వాల గుత్తా ఎక్స్ క్లూజివ్ ఇంటర్యూ

Jwala Gutta
పూణే: లండన్ ఒలంపిక్స్‌లో పాల్గోనేందుకు సరైన స్పాన్సర్లు లేక ఇబ్బంది పడుతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, దిజులకు సహాకారమందించేందుకు నాలుగు సంస్దలు ముందుకొచ్చాయి. ఈ సంస్దలు వీరి ముగ్గురికి లండన్ ఒలంపిక్స్ లక్ష్యంగా సన్నద్దమయ్యేందుకు అండగా ఉంటామని లక్ష్య ఇనిస్టిట్యూట్, అవినాశ్ బోసలే ఇన్ ఫ్రాస్టక్చర్, శ్లోక్ - జైరాజ్ గ్రూప్, పంచశిల్ సంస్దలు మాట ఇచ్చాయి.

ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ స్టార్ గుత్తా జ్వాలకు అవినాశ్ బోసలే ఇన్ ఫ్రాస్టక్చర్ స్పాన్సర్‌గా వ్యవహారించనుంది. 13 సార్లు జాతీయ మహిళల ఛాంపియన్‌గా నిలిచిన జ్వాల గతయేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో అశ్వినితో కలసి చరిత్ర సృష్టించింది. మహిళల ఛాంపియన్ షిప్‌లో పతకం సాధించిన భారత జోడిగా వీరు రికార్డు సాధించారు. ఇందులో పతకం నెగ్గిన తొలి భారత జోడిగా రికార్డుల్లోకెక్కింది. ఇదే జోరుతో లండన్ ఒలింపిక్స్‌లో బెర్తు సంపాదించేందుకు ఆమెకు అవినాశ్ బోసలే ఇన్ ఫ్రాస్టక్చర్ అండగా ఉండనుంది. ఈ సందర్బంలో ఓ ప్రముఖ పత్రికకు జ్వాల గుత్తా ఇచ్చిన ఇంటర్యూ పాఠకులకు ప్రత్యేకం...

మీ ముగ్గురికి స్పాన్సర్స్ దొరికారు కదా..సరైన సమయానికి స్పాన్సర్స్ లభించినట్లేనా..?

జ్వాల: మేము ఎప్పడూ మాకు స్పాన్సర్స్ వస్తారని అనుకోలేదు.. కానీ చివరకు మాకు కుడా స్పాన్సర్స్ లభించినందుకు సంతోషంగా ఉన్నాం.. క్రికెట్‌తో పోల్చితే వేరే ఇతర క్రీడలు కోసం స్పాన్సర్లు రావడం చాలా కష్టం. కానీ లక్ష్య వంటి సంస్థలు మాకు స్పాన్సర్ షిప్ చేసేందుకు ముందుకు రావడం గ్రేట్ జాబ్.

మీ లండన్ సన్నాహాలు ఎలా ఉన్నాయి?

జ్వాల: మా వంతు మేము గట్టిగానే మంచి ఆటను ప్రదర్శించేందుకు కృషి చేస్తున్నాం.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ ప్రకటించే మే 2 లోపున ప్రకటించనున్న తరుణంలో ఈ లోపే మేము కొన్ని అంతర్జాతీయ పోటీలలో పాల్గొనలానే ఆలోచనలో ఉన్నాం.

ప్రస్తుతం, దిజు నేను 13 వ స్థానంలో ఉన్నాం. అదే మహిళల డబుల్స్ ర్యాంకింగ్ లో మేము (అశ్వినీ తో) 18వ స్దానంలో ఉన్నామని తెలిపారు. మేము మహిళల డబుల్స్లో దాన్ని మెరుగుపరచడానికి మరిన్ని టోర్నమెంట్స్ ఆడడమే కాకుండా, మిక్స్డ్ డబుల్స్‌లో మా ర్యాంకింగ్ మెరుగు పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.

మీరు భారతదేశం లో ఈవెంట్స్ డబుల్స్ ప్రాచుర్యంలోకి క్రెడిట్ తీసుకుని అనుకుంటున్నారా?

జ్వాల: డబుల్స్ బాడ్మింటన్ ప్లే సింగిల్స్ కంటే సులభంగా ఉంటుందనే భావనను ప్రజలు కలిగి ఉన్నారు. రెండు కేటగిరీలు వేర్వేరు అయినప్పటికీ ఆడడం చాలా కష్టం. ఇప్పుడు మారుతున్న పరిస్దితులను బట్టి ప్రజలు డబుల్స్ మ్యాచ్‌లను చూడడం మొదలుపెట్టారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+