Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కఠిక దరిద్రంలో అలనాటి స్విమ్మింగ్ ఒలంపియన్

The Olympic legend of an Indian swimming hero
ఒలంపిక్స్‌లో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి స్విమ్మర్‌ 'షంసేర్ ఖాన్' ని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరచిపోయి.. దేశం తరుపున స్విమ్మింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఒలంపిక్ తొలి స్విమ్మర్‌గా సందీప్ సేజ్వాల్‌ని గుర్తించి షంసేర్ ఖాన్‌ని అవమానించింది. అది 1956 మెల్ బోర్న్ గేమ్స్‌లో షంసేర్ ఖాన్ స్విమ్మింగ్‌లో ఐదవ స్దానాన్ని కైవసం చేసుకోగా.. ఇటీవల జరిగిన 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో సందీప్ సేజ్వాల్‌ 36వ ప్రిలిమినరీ రౌండ్ర్స్‌లో 36వ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు.

50 సంవత్సరాల క్రితం ఇండియా తరుపున స్విమ్మింగ్‌కు ప్రాతనిధ్యం వహించిన షంసేర్ ఖాన్ తన ఊరిలో ఉన్న లోకల్ పూల్స్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. అలా ప్రాక్టీస్ చేసి దేశానికి ప్రాతినిధ్యం వహించిన 82 సంవత్సరాల వయసు కలిగిన షంసేర్ ఖాన్ ప్రస్తుతం కఠిక దరిద్రంలో ఉన్నాడు. షంసేర్ ఖాన్ స్వస్దలం గుంటూరు జిల్లాలోని రేపల్లే మండలంలో కైతీపల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ వయసులో గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ.. ఇతనికి ఏ స్పోర్ట్స్ బాడీ కూడా పెన్షన్, రివార్డుని ఇవ్వలేదు.

1990లో వచ్చిన వరదల వల్ల షంసేర్ ఖాన్ పూర్తిగా కొట్టుకపోయింది. ఆ సమయంలో చాలా తక్కువ సహాయం అందజేయగా.. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ ఒలంపియన్‌ని ఈవిధంగానేనా మీరు గౌరవించేది అని సమావేశంలో అధికారులను ప్రశ్నించానని షంసేర్ ఖాన్ ఓ ప్రముఖ వార్తా సంస్దకు తెలియజేశారు. ఈ సందర్బంలో షంసేర్ ఖాన్ చిన్న కొడుకు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం తన తండ్రి హార్ట్ స్ట్రోక్‌కు గురి అయ్యాడని చెప్పాడు.

షంసేర్ ఖాన్ విషయానికి వస్తే 1954లో 200 మీటర్ల బటర్ ప్లే స్విమ్మింగ్‌లో జాతీయ రికార్డుని నెలకొల్పాడు. మెల్ బోర్న్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో బటర్ ప్లే, బ్రెస్ట్ స్ట్రోక్ రెండు ఈవెంట్లలో షంసేర్ ఖాన్ పాల్గోన్నాడు. మెల్ బోర్న్ ఒలంపిక్స్‌లో పాల్గోనేందుకు గాను ఎయిర్ టికెట్‌ని స్పాన్సర్ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ డబ్బుని నా జీతం నుండి తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ.. ఆలాంటి పెద్ద ఈవెంట్లో తనకి అవకాశం కల్పించినందుకు ధన్వవాదాలు తెలియజేశారు.

షంసేర్ ఖాన్ ఇండియా ఆర్మీలో తన సేవలను అందించారు. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్దంతో పాటు 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ద సమయంలో ఈయన ఇండియన్ ఆర్మీలోనే ఉన్నారు. తన జీతం ద్వారా వచ్చిన డబ్బుని జాతీయ, అంతర్జాతీయ్ స్విమ్మింగ్ పోటీలకు వినియోగించేవారు. సుబేదార్‌గా 1973లో ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సైనిక్ సమాచార్, ఆర్మీ బులిటెన్‌ల ప్రకారం ఇండియన్ ఆర్మీ షంసేర్ ఖాన్‌ని ఓ వజ్రంగా భావిస్తారని తెలిసింది.

షంసేర్ ఖాన్ పెద్ద కుమారుడు షావలి జవాన్‌గా ఇండియన్ ఆర్మీకి తన సేవలనందిస్తున్నాడు. షంసేర్ ఖాన్ తన రెండవ కుమారుడు షా ఆలీతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. జులై 27 నుండి జరగనున్న లండన్ ఒలంపిక్స్‌లో భారత్ నుంచి బరిలోకి దిగుతున్న ఏకైక స్విమ్మర్ గగన్ ఉలాల్మత్. ఆగస్టు 3న జరిగే 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో పోటీపడతాడు. ఈ దశ దాటితే ఆగస్టు 4న జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+