Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

8 వేదికలు, 31 మ్యాచ్‌లు, 16 జట్లు.. యూరో 2012

Euro 2012
వార్సా, జూన్ 8: 8 వేదికలు, 31 మ్యాచ్‌లు, 16 జట్లు. సాకర్ అభిమానులు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అనుకుంటున్న యూరో కప్ 2012 వచ్చేసింది. జూన్ 8(శుక్రవారం) నుండి జులై 1వ వరకు జరగనున్న ఈ యూరో 2012 కప్‌కు పోలెండ్, ఉక్రెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

యూరో 2012లో పాల్గోనోనున్న 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, మొత్తం 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మొదటి మ్యాచ్ రాత్రి 9.30గంటలకు, రెండవ మ్యాచ్ 12.15 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రతి గ్రూప్ నుండి టాప్ - 2 జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి.

శుక్రవారం జరిగే ఆరంభ వేడుకలకు పోలెండ్‌లోని వార్సా నేషనల్ స్టేడి యం ఆతిథ్యమిస్తోంది. అనంతరం ఇదే వేదికపై రాత్రి 9:30 గంటలకు జరిగే ఆరంభ మ్యాచ్‌లో గ్రూప్-ఎ నుంచి ఆతిథ్య పోలెండ్, గ్రీస్ తలపడనున్నాయి. ఇక పోలెండ్‌లోని రోక్లాలో అర్ధరాత్రి 12:15 గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో ఇదే గ్రూప్ నుంచి రష్యా, చెక్ రిపబ్లిక్ తలపడనున్నాయి.

యూరో 2012లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌తో పాటు రన్నరప్ జర్మనీ, ఇంగ్లండ్, గ్రీస్, ఫ్రాన్స్, పో ర్చుగల్, ఇటలీ తదితర జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సంవత్సరం స్పె యిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్‌ జట్లును ఫేవరెట్లుగా పరిగణిస్తున్నారు. గతయేడాది స్పెయిన్‌ను ఛాంపియన్‌గా నిలిపిన టోర్నీ టాప్ స్కోరర్ ఆటగాడు డేవిడ్ విల్లా గాయం కారణంగా తప్పుకున్నాడు.

ఈరోజు జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పోలెండ్, మాజీ ఛాంపియన్ గ్రీస్ తలపడనున్నాయి. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో ఎలాగైనా సరే ఈసారి కప్ కొట్టాలని ఉద్దేశ్యంతో ఉంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో పోలెండ్‌ది 65వ స్థానం. గ్రీస్ మాత్రం ఫిఫా ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉంది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+