
ప్రపంచ ర్యాంకింగ్‌లో ఏడవ స్దానంలో ఉన్న లియాండర్ పేస్‌కు మద్దతుగా నిలిచిన సుబ్రతో రాయ్ సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్‌కు జతగా తక్కువ ర్యాంక్ ఆటగాడిని ఆలిండియా టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎంపిక చేయడాన్ని విమర్శించారు. చెత్త రాజకీయాలు పతకం గెలిచే అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఆటగాళ్లను కఠినంగా శిక్షించాలని రాయ్ వ్యాఖ్యానించారు. కుళ్లు రాజకీయాల వల్ల పేస్ ఆత్మాభిమానాన్ని త్యాగం చేయాల్సి వస్తోంది. స్వప్రయోజనాల కోసమే ఏఐటీఏ, క్రీడాశాఖ జాతి గౌరవాన్ని పణంగా పెడుతున్నాయని రాయ్ అన్నారు.
ఇక లండన్ ఒలింపిక్స్‌లో పేస్ పాల్గొంటాడా? లేదా? అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. డబుల్స్ విభాగంలో భారత్ నుంచి రెండు జట్లు వెళుతుండగా... తనతో జతగా జూనియర్ ఆటగాడు విష్ణువర్ధన్‌ను ఎంపిక చేయడంపై పేస్ అసంతృప్తితో ఉన్నాడు. ప్రస్తుతం లండన్‌లో వింబుల్డన్ పోటీలకు సిద్ధమవుతున్న పేస్ ఈ ఎంపికకు మద్దతుగా, వ్యతిరేకంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. సీనియర్ సెలక్టర్ రోహిత్ రాజ్‌పాల్ కూడా అతడిని ఒప్పించేందుకు లండన్ వెళ్లారు. అయితే ఈ అంశంపై ఈనెల 28న స్పష్టత రానుంది.
తెలుగు వన్ఇండియా