న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరో టైటిల్‌ని నిలబెట్టుకోని చరిత్ర సృష్టించిన స్పెయిన్

By Nageswara Rao
Spain make history to retain European title
కివ్, జులై 2: ఉక్రెయిన్ రాజధాని కివ్ లో ఆదివారం రాత్రి స్పెయిన్, ఇటలీ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీపై స్పెయిన్ 4-0తో గెలిచి వరుసగా మూడవ సారి టైటిల్‌ను సొంతం చేసుకోని ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ మరోసారి యూరో కప్‌లో తన సత్తాని చాటింది. స్పెయిన్ ఆటగాళ్లు డేవిడ్ సిల్వా, జోర్డి ఆల్బా, ఫెర్నాండో టోరెస్, జూన్ మాతా గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన స్పెయిన్ 14వ నిమిషంలోనే మాంచెస్టర్ ఆటగాడు డేవిడ్ సిల్వా మొదటి గోల్ నమోదు చేశాడు. ఆట మొదటి అర్థభాగానికి నాలుగు నిమిషాల ముందు(41 నిమిషంలో) జోర్డి ఆల్బా రెండో గోల్‌ని సాధించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్ట్‌పై పదేపదే దాడులు చేసిన స్పెయిన్ చివరివరకు అదే ఊపు కొనసాగించింది. 84, 88 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించి ఇటలీని చిత్తు చేసింది.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

నాలుగు సంవత్సరాలు క్రితం జర్మనీతో జరిగిన 2008 ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు ఫెర్నాండో టోరెస్ ఏ విధంగా నైతే గోల్ సాధించాడో అదే విధంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో గోల్ సాధించాడు. 2008 యూరో, 2010 ఫిఫా ప్రపంచకప్, 2012 యూరోకప్ టైటిళ్లు గెల్చుకుని స్పెయిన్ 'హ్యాట్రిక్' రికార్డు సాధించింది. దీంతో ఉక్రెయిన్ రోడ్లన్నీ ఛాంపియన్స్ స్పెయిన్ అంటూ మార్మోగి పోయాయి.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X