Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూరోకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన జట్టుగా చరిత్ర

Spain beat Portugal on penalties to reach Euro final
డొనెట్క్స్ (ఉక్రెయిన్), జూన్ 29: డిఫెండింగ్‌ చాంపియన్‌ స్పెయిన్‌ యూరోకప్‌ 2012లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి యుక్రెయిన్‌ డోనెట్‌స్క్‌లో జరిగిన తొలి యూరో 2012 ఫుట్‌బాల్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్‌ జట్టు పెనాల్టీలతో 4-2తో తమ పొరుగు దేశం పోర్చుగల్‌పై విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా యూరో కప్ గెలుచుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన పోర్చుగల్ ఆశలపై నీళ్లు చల్లింది. నిర్ణీత సమయానికి ఇరుజట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో దాంతో 30 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. అందులోనూ ఫలితం లేకపోయింది. 0-0తో మ్యాచ్‌ ముగిసింది.

దాంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్‌ 4 గోల్స్‌ చేయగా పోర్చుగల్‌ 2 మాత్రమే చేసింది. స్పెయిన్‌ ఆటగాడు సెస్‌ ఫాబ్రెగాస్‌ షూటౌట్‌లో విన్నింగ్‌ గోల్‌తో జట్టును ఫైనల్‌ చేర్చాడు. కాని పోర్చుగల్‌ మొదటి పెనాల్టీ షాట్‌ వ్యర్థమైంది. బ్రూనో ఆల్వెస్‌ తమ జట్టు నాలుగవ పెనాల్టీ షాట్‌ క్రాస్‌బార్‌కు తగిలి వెనుకకు వచ్చింది. ఆ తరువాత ఫాబర్‌గాస్‌ వంతు రాగా యూరో 2008 క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్‌ విజయంలో వలె అతను కొట్టిన బంతి సరిగ్గా గోల్‌లోకి వెళ్లింది. దీంతో పోర్చుగల్‌ ఇంటి దారి పట్టింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

యూరో కప్‌లో పోర్చుగల్‌ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని ఆ జట్టు ఫార్వర్డ్‌ ఆటగాడు కెప్టెన్‌ క్రిస్టినో రోనాల్డో తెలిపాడు. ఫెనాల్టీ షూటౌట్‌లో తమ జట్టు ఓడినా తమకు బాధ లేదన్నాడు. తాము చేయాల్సింది చేశామని, మెరుగైన ప్రదర్శన చేశామని మాంచెస్టర్‌ యునైటెడ్‌ స్టార్‌ ఆటగాడు నాని తెలిపాడు. రోనాల్డో క్లబ్‌ జట్లలో రియల్‌ మ్యాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

ఐతే మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి పోర్చుగల్.. స్పెయిన్‌కు గట్టి పోటీనే ఇచ్చింది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను అడ్డుకోవడమే ధ్యేయంగా డిఫెండింగ్ చాంపియన్ ఆడి సఫలమైంది. పలుమార్లు గోల్ అవకాశాలు వచ్చినా రొనాల్డో విజయవంతం కాలేకపోయాడు. స్పెయిన్‌ యూరోకప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. ఫైనల్లోనూ గెలిస్తే యూరోకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టిస్తోంది.

ఇక యూరో టోర్నీలో సెమీ ఫైనల్స్ అంకం ముగిసింది. దీంతో సెమీ ఫైనల్స్-1లో పోర్చుగల్ ఇంటికి వెళితే, సెమీ ఫైనల్స్-2లో జర్మనీ ఇంటి దారి పట్టింది. సెమీ ఫైనల్-1లో ఇటలీతో ఏక పక్షంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ 1-2 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. టోర్నీ ఆద్యంతం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆడిన ఇటలీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. దీంతో జూన్ 1న కివ్‌లో స్పెయిన్‌తో ఇటలీ ఫైనల్‌లో తలపడనుంది.

యూరో 2012: ఫైనల్

జులై 1: స్పెయిన్ వర్సెస్ ఇటలీ

నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+