For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో స్టేజ్-2కు విజయ్, నిరాశ పర్చిన రంజన్ సోధీ

By Nageswara Rao
Ronjan Sodhi
లండన్, ఆగస్టు 3: లండన్ ఒలింపిక్స్‌లో భాగంగా గురువారం జరిగిన 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో విజయ్ కుమార్ రెండో స్టేజ్-2కు అర్హత సాధించాడు. విజయ్ కుమార్ క్వాలిఫయింగ్ స్టేజ్-1లో 293 (99+96+98) పాయింట్లు గెలిచి ఐదో స్థానంలో నిలిచాడు. తొలి రౌండ్‌లో విజయ్ కుమార్ సగటున 9.76 పాయింట్లు సాధించగా.. విజయ్‌తో పాటు క్యూబా, చెక్‌ రిపబ్లిక్‌లకు చెందిన ఒక్కొక్కరు, చైనాకు చెందిన ఇద్దరితో కలిపి మొత్తం మరో నలుగురు షూటర్లు కూడా సమానంగా పాయింట్లు సాధించారు.

పాయింట్ల పట్టికలో ష్యాకు చెందిన అలెక్సీ క్లిమోవ్‌ 294 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగనున్న రెండో స్టేజ్‌ పోటీల్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇక విజయ్ కుమార్ విషయానికి వస్తే 2010లో జరిగిన ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాధించండతో పాటు, అదే ఏడాది జరిగిన ఆసియా గేమ్స్‌లో ఒక కాంస్య పతకం సాధించాడు.

ఇది ఇలా ఉంటే ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న షూటర్ రంజన్ సోధి అభిమానుల ఆశలను నిరాశకు గురి చేశాడు. ఫైనల్స్‌కు చేరుకోవడంలో సోథీ విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో మొత్తం 50 పాయింట్లకుగాను 48 పాయింట్లు చేసి, టాప్‌ స్థానంలో నిలిచినప్పటికీ.. తర్వాతి రెండు రౌండ్లలో 44, 42 పాయింట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో రంజన్ 150 పాయింట్లకు గాను 134 పాయింట్లు సాధించి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

షూటింగ్ అనంతరం సోది మాట్లాడుతూ ఇంతకు ముందెప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రదర్శన కనబర్చలేదని వాపోయాడు. నేనేమీ చెత్తగా షూట్ చేయలేదు. ఆఖరి రౌండ్‌లో డ్రాప్ షాట్స్ కూడా ఎక్కువగా లేవు. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వాటిని విశ్లేషించుకోవాలి. ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు. అయితే తొలి రౌండ్‌లో మెరుగ్గా ఆడా. అది అలాగే కొనసాగితే ఫైనల్స్‌కు వెళ్లేవాడ్ని అని సోధి వివరించాడు. 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సోధి ఒలింపిక్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఫైనల్స్‌కు చేరడంలో విఫలమయ్యాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+