ఫుట్‌బాల్: ఫిక్సింగ్ చేస్తే అమ్మాయిలు, లెబనీస్‌కు జైలు

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు పలువురు డబ్బులు, అమ్మాయిలను ఎరగా వేస్తుంటారు. ప్రధానంగా అమ్మాయిలను ఎరవేయడం ఎక్కువగా అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఐపిఎల్‌లోను పలువురికి అమ్మాయిలను ఎర వేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా సింగపూర్ ఫుట్‌బాల్‌లో ఫిక్సింగ్ కుంభకోణం బయటపడింది. ఇది అక్కడ సంచలనం రేపింది. మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేస్తే డబ్బులు మాత్రమే కాకుండా అమ్మాయిలనే ఆటగాళ్లకు ఎర వేశారట. ఈ బాగోతం బయట పడింది. సింగపూర్ కోర్టు లెబనాన్‌కు చెందిన ఇద్దరు సహాయక కోచ్‌లకు మూడు నెలల జైలు శిక్షను విధించింది.
ఈ నేరంలో రిఫరీకి కూడా భాగం ఉండటంతో అతనికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. అతను కూడా లెబనాన్‌కు చెందిన వాడే. ఆటగాళ్లకు సోమవారమే శిక్షను విధించిన కోర్టు, రిఫరీకి మంగళవారం విధించింది. ఇతను అమ్మాయిల కోసం సాకర్ గేమ్స్‌ను ఫిక్స్ చేసేందుకు ఒప్పుకున్నారట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications