Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దొంగగా ముద్ర వేసి, ఓ షట్లర్ ఉసురు తీశారు

Shuttle ends life over theft slur
కాకినాడ: బ్యాడ్మింటన్‌ క్రీడలో ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్న ఓ ఆ క్రీడాకారుడు తనపై దొంగతనం ముద్ర వేయడంతో ఉసురు తీసుకున్నాడు. ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తనపై దొంగతనం నేరం ఆరోపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఆటగాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కాకినాడలో సోమవారం జరిగింది.

మహాదాస్ జ్యోతి స్వరూప్ అనే 17 ఏళ్ల యువకుడు కాకినాడలోని బాపన్నదొర కాలనీలో గల తన ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. మూడు రోజుల క్రితం బ్యాడ్మింటన్ రాకెట్లను దొంగిలించావంటూ పిఇటి రామారావు అతన్ని తిట్టిపోశాడు. రాకెట్లు దొంగిలించాడంటూ స్వరూప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రామారావు అతని తండ్రికి కూడా చెప్పాడు.

స్వరూప్ పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పాఠశాలల పోటీల్లో పాల్గొన్నాడు. స్వరూప్ పది వేల రూపాయల విలువ చేసే రాకెట్లను దొంగిలించాడని ఆరోపించారు. రాకెట్లను దొంగిలించాడని స్వరూప్‌పై పెద్దాపురం జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్, పిఇటి ఆరోపించారు. ఈ పాఠశాలలో స్వరూప్ బ్యాడ్మింటన్ తరగతులు చెబుతున్నాడు.

ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఇసిఇ చదువుతున్న స్వరూప్ ప్రిన్సిపాల్, పిఇటి విజ్ఞప్తి మేరకు వారి పాఠశాల విద్యార్థలకు బ్యాడ్మింటన్‌లో పాఠాలు చేబుతున్నాడు. ప్రిన్సిపాల్, పిఇటి తనను మానసిక క్షోభకు గురి చేసినందువల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను తన సూసైడ్ నోట్‌లో రాశాడు. ప్రిన్సిపాల్ పివిఎన్ మూర్తి, పిఇటి వేధింపుల వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని స్వరూప్ తండ్రి చిన్నయ్య దోర ఆరోపించారు. అయితే ఆరోపణలను ప్రన్సిపాల్, పిఇటి ఖండించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+