
నాకు ఇచ్చిన పదోన్నతి ఆఫీసర్ ర్యాంక్ పోస్టు కాదు. ఇది జూనియర్ కమీషనర్ ర్యాంక్, నేను ఊహించినది సీనియర్ కమీషనర్ ర్యాంక్ (ఆఫీసర్ ర్యాంక్). నాకు సీనియర్ కమీషనర్ ర్యాంక్(ఆఫీసర్ ర్యాంక్) కావాలని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆ రిక్వెస్ట్‌ని మాపై అధికారులు 5-6 నెలల్లో పరిశీలిస్తామన్నారు. ఈ విషయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్ కూడా అభయ హాస్తం ఇచ్చాడని విజయ్ కుమార్ మీడియాలో వెల్లడించాడు. కేబినెట్ పాస్ చేసిన బిల్ ప్రకారం ఒలింపిక్స్‌లో మెడల్ సాధిస్తే IAS ర్యాంక్ జాబ్స్ ఇస్తామన్నారు. చూద్దాం ఏమి జరుతుందో అని చెప్పాడు.
గత డిసెంబర్‌లోనే నాకు ప్రమోషన్ రావాల్సి ఉన్నప్పటికీ.. మెరిట్ లిస్ట్‌లో నా పేరు లేదు. మళ్లీ నేను ఫామ్ నింపగా ఈరోజు నాకు ప్రమోషన్ లభించింది. దీంతో తనకు న్యాయం లభించిందని, గుర్తింపు కూడా దక్కిందని విజయ్ కుమార్ తెలిపాడు. అతని విద్యార్హతలను బట్టి ఇంకా పైస్థాయి ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె.సింగ్ వెల్లడించారు. 'విజయ్‌కి ఆంగ్ల పరిజ్ఞానం ఉంది. ఉన్నత చదువు పూర్తి చేశాడు కాబట్టి కమిషన్ ఆఫీసర్ (గ్రేడ్ ఆఫ్ ఆఫీసర్)గా పదోన్నతి లభిస్తుంది' అని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ, జాతీయ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తున్నప్పటికీ ఆరేళ్లుగా పదోన్నతి లేదని ఇటీవల విజయ్ వాపోయాడు. త్వరలో ఆర్మీ నుంచి వైదొలుగుతానని కూడా అన్నాడు. దీంతో దిగివచ్చిన ఆర్మీ ఉన్నతాధికారులు అతనికి పదోన్నతితో పాటు ప్రోత్సాహాకాలను ప్రకటించారు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించినందుకు గాను SAIL కంపెనీ విజయ్ కుమార్‌కి రూ. 25 లక్షలను నజరానాగా అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆర్మీకి చెందిన 14 మంది ఒలింపియన్లను సన్మానించారు. బాక్సర్లు దేవేంద్రో సింగ్, శివ థాపాలకు రూ.లక్ష అందజేశారు.
తెలుగు వన్ఇండియా