
ఈ మ్యాచ్‌లో నమోదైన మూడు గోల్స్ రెండు జట్ల కెప్టెన్లు చేయడం విశేషం. ఆట 52వ నిమిషంలో స్వీడన్ కెప్టెన్ జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ చేసిన గోల్‌తో స్వీడన్ ఖాతా తెరిచింది. అయితే వారి ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. సహచరుడు ఆండ్రీ యార్మోలెంకో సంధించిన క్రాస్ పాస్‌ను ఉక్రెయిన్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ ఆండీ షెవ్‌చెంకో 55వ నిమిషంలో 'హెడర్' షాట్‌తో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో స్కోరు 1-1వద్ద సమమైంది.
ఆట 62వ నిమిషంలో కొనొప్లయాంకా కార్నర్ షాట్‌ను ఈసారీ షెవ్‌చెంకో 'హెడర్' షాట్‌తో లక్ష్యానికి పంపించి ఉక్రెయిన్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఏడు నిమిషాల వ్యవధిలో ఉక్రెయిన్ రెండు గోల్స్ చేయడంతో స్వీడన్ తేరుకోలేకపోయింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.
UEFA యూరో 2012 రిజల్ట్స్ వివరాలు
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 9.30 గంటలకు డెన్మార్క్ వర్సెస్ పోర్చుగల్
రాత్రి 12.15 గంటలకు నుంచి నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీ
తెలుగు వన్ఇండియా