
వారం క్రితమే ఇండోనేషియాకు చెందిన ప్రపంచ క్రీడాకారుడు తాఫిక్ హిదాయత్‌కు ప్రణీత్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరల్డట్ నెంబర్ 4 ఆటగాడు యున్ హూను ఓడించి సత్తా చాటాడు. అత్యంత సునాయసంగా సాయి ప్రణీత్ ఆటను అరగంటలో ముగించాడు.
సాయి ప్రణీత్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-10తో వరుస గేముల్లో గెలుచుకుని రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. అయితే ఇదే విభాగంలో థాయ్‌లాండ్ ఓపెన్ చాంపియన్ శ్రీకాంత్, గురుసాయిదత్, కశ్యప్‌లకు నిరాశ ఎదురైంది. శ్రీకాంత్ ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీని గెలుచుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్‌కు చెందిన భారత షట్లర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో శుభారంభం చేసింది. థాయ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమికి జువాన్ గుపై ప్రతీకారం తీర్చుకుంది. 21-14, 23-21తో వరుస గేముల్లో గెలిచి రెండో రౌండ్లో ప్రవేశించింది. రెండో రౌండ్లో జపాన్ క్రీడాకారిణి ఎరికో హిరోస్‌తో సైనా తలపడనుంది.ఇక టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్ నుంచే ఇంటి దారి పట్టాడు.