
హి దాయత్‌కు సొంత అభిమానుల మద్దతు లభించినా, తొలి గేమ్ నెగ్గి ముందంజలో ఉన్నా 20 ఏళ్ల ప్రణీత్ ఆత్మవిశ్వాసంతో పుంజుకుని వీరోచితంగా పోరాడాడు. హిదాయత్ ఈ టోర్నమెంట్‌తో రిటైర్మంట్ తీసుకుంటున్నట్లు ముందే ప్రకటించాడు. దీంతో హిదాయత్‌ను ఓటమితో సాయి ప్రణీత్ ఇంటి దారి పట్టించాడు. బ్యాడ్మింటన్ మెకెన్రోగా ప్రసిద్ధి గాంచిన హిదాయత్ ప్రపంచత, ఒలింపిక్ చాంపియన్స్ ట్రోఫీలను ఒకేసారి గెలిచి రికార్డు సృష్టించాడు.
కశ్యప్‌కు షాక్
ఆంధ్రప్రదేశ్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే ఇంటిదారిపట్టాడు. కశ్యప్ మినహా సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు గురుసాయి దత్, అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ ముందంజ వేశారు. తొలిరౌండ్లో ప్రపంచ పదో ర్యాంకర్ కశ్యప్ 7-21, 8-21తో 19వ ర్యాంకర్ షో ససాకి (జపాన్) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.
కాగా రాష్ట్రానికే చెందిన యువ షట్లర్ గురుసాయిదత్ 22-20, 21- 16తో ఇండోనేసియా ఆటగాడు ఆండ్రీ కుర్నియవన్‌పై నెగ్గాడు. రెండో రౌండ్లో జపాన్ షట్లర్ కజుమస సకాయితో తలపడనున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 22-20, 8-21, 21-12తో స్థానిక షట్లర్ రియంటోపై, సౌరభ్ 19-21, 21-14, 21-15తో హన్స్-క్రిస్టియన్ (డెన్మార్క్)పై నెగ్గారు.