Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్: క్రీడాకారులకు సహారా బంగారు నజరానాలు

Sahara
లక్నో, జులై 27: ఈరోజు లండన్‌లో అంగరంగ వైభవంగా ప్రధాన స్టేడియం స్టాన్‌ఫోర్డ్‌లో ఒలింపిక్ సన్నాహాలు ప్రారంభం కానున్నాయి. లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అథ్లెట్లపై కనక వర్షం కురవనుంది. ఇక వివరాల్లోకి వెళితే లండన్‌లో స్వర్ణం సాధిస్తే 5 కేజీల స్వచ్ఛమైన గోల్డ్ మెడల్ అందిస్తామని సహారా ఇండియా పరివార్ ప్రకటించారు.

లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే మహా అయితే ఆరు గ్రాముల బంగారంతో పూత పూసిన పతకం అం దిస్తారు. కానీ, ఆ బంగారు పతకం సాధించుకుని వచ్చి న భారత అథ్లెట్లకు పూర్తిగా బంగారంతో చేసిన పతకాలిస్తామని కార్పొరేట్ దిగ్గజం సహారా ఇండియా పరివార్ ప్రకటించింది. రజతం సాధిస్తే 3 కేజీలు, కాంస్యం గెలిస్తే 2 కేజీల గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేస్తామని వెల్లడించారు. టీమ్ ఈవెంట్‌లో పతకాలు గెలిస్తే ఆ బృందమంతటికీ సమానంగా బంగారాన్ని పంచుతారన్నారు.

ఈ సందర్బంలో సహారా పరివార్ ఛైర్మన్ సుబ్రతోరాయ్ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికపై దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారుల్ని గౌరవించడానికి చేస్తున్న చిన్నపాటి ప్రయత్నమిదని అన్నారు. క్రీడాకారులను గౌరవించడంలో హర్యానా ముందు వరుసలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా మరోసారి నిరూపించారు.

లండన్ ఒలింపిక్స్‌లో హర్యానా అథ్లెట్లు స్వర్ణం సాధిస్తే రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించా రు. అందేకాదు భారత్ తరపున ఎవరు స్వర్ణం సాధించి నా వారికి కూడా రూ. 1.5 కోట్లు, రజతం, కాంస్యం నె గ్గిన వారికి రూ. కోటి నజరానా అందించనున్నట్టు హు డా తెలిపారు. హర్యానా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ రూ. 11 లక్షలు ఇస్తున్నారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+