For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'సుశీల్ కుమార్' కి ఢిల్లీ ప్రభుత్వం రూ. కోటి నజరానా

By Nageswara Rao
Sushil Kumar
న్యూఢిల్లీ, ఆగస్టు 13: లండన్ ఒలింపిక్స్‌లో ఆఖరి రోజు 66 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజతం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో రజతం సాధించినందుకు గాను సుశీల్ కుమార్‌కి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కోటి రూపాయల నగదు పారితోషకాన్ని ప్రకటించింది. ఈ సందర్బంలో షీలా దీక్షిత్ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో రజతం సాధించనందుకు గాను అతనిని ప్రజలు అందరి తరుపున అభినందిస్తున్నాను. దేశం మొత్తం అతని హార్డ్ వర్క, అంకుఠిత దీక్షను చూసి గర్విస్తుందని అన్నారు.

ఇక సుశీల్ కుమార్ 66 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌ రజతం గెలవడం వల్ల వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఢిల్లీ శివార్లలోని బోప్రాలా (నజఫ్ గడ్ ప్రాంతం) గ్రామానికి చెందిన సుశీల్ కుటుంబంలో చాలా మంది రెజ్లర్లు ఉన్నారు. అతని తాత, తండ్రి, సోదరుడు సందీప్ అందరూ రెజ్లర్లే. అనుకోకుండా వీరు ముగ్గురు మధ్యలో రెజ్లింగ్‌ను వదిలివేశారు.

ఒకరికి మించి రెజ్లర్ అయ్యే అవకాశం లేని పేద కుటుంబం వారిది. అందుకే సుశీల్ కుమార్‌ను ఉత్తమ రెజ్లర్‌గా తీర్చిదిద్దారు. సుశీల్ కుమార్ తండ్రి దివాన్ సింగ్ బస్ డ్రైవర్. ఆదాయంలో ఎక్కువ భాగం సుశీల్ శిక్షణకే కేటాయించేవారు. 14 యేళ్ల నుండే సుశీల్ కుమార్ ఛత్రశాల్ స్డేడియంలోనే ఉంటూ శిక్షణ తీసుకునే వాడు. రోజూ అక్కడికి క్యాస్‌లో పాలు, డబ్బాలో నెయ్యి, ఉడికించిన కూరగాయలు పంపేవారు. సుశీల్ కుమార్ కోసం గ్రామస్దులు కూడా కాస్త కుటుంబానికి సాయం చేసేవారు.

సుశీల్‌లోని నిబద్దత అతన్ని ఈరోజు ఇంతటి వాడిని చేసిందంటారు అతని కోచ్‌లు. అందుకు 2007లో జరిగిన ఒక సంఘటను గుర్తు చేశారు. 2007వ సంవత్సరంలో తన తాత గారు చనిపోయాడు. ఆయన కూడా రెజ్లరే. సుశీల్ కుస్తీ వైపు వెళ్లడానికి కారణం ఆయనే. మనవడిని ఒలింపిక్ ఛాంపియన్‌గా చూడాలన్నది ఆయన ఆశయం. అది తీరకుండానే ప్రాణాలు వదిలాడు. తన తాత చనిపోయిన మరుసటి రోజే పొద్దునే ప్రాక్టీస్‌కు వచ్చాడు సుశీల్. అదేంటని కోచ్ యశ్వీర్ అడడగా మా తాత కల నెరవేర్చాలి అని బదులిచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినప్పుడు అనేక సన్మాన కార్యక్రమాలకు హాజరైనా విశ్రాంతి తీసుకోకుండా సుశీల్ ఇప్పటికీ ప్రాక్టీస్ చేసేవాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+