Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కప్ మాదేనన్న రామ్‌చరణ్‌తేజ: దీపిక, బిపాసా సందడి

Ram Charan
హైదరాబాద్: సిసిఎల్ క్రికెట్ పోటీలలో ఈసారి తాము కచ్చితంగా కప్‌ను సొంతం చేసుకుంటామని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఆదివారం చెప్పారు. రామ్ చరణ్ తేజ ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. సిసిఎల్ పోటీలను తాము బాగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.

తమ జట్టులోని సభ్యులు అందరూ బాగా రాణిస్తున్నారని ఆయన చెప్పారు. తాము సమష్టిగా వెళ్తున్నామని చెప్పారు. ఈసారి కప్ తమ సొంతం కావడం ఖాయమని ఆయన చెప్పారు. మరోవైపు తెలుగు వారియర్స్, ముంబయి హీరోస్ మధ్య ఈ రోజు రాత్రి జరుగనున్న సిసిఎల్ మ్యాచు కోసం బాలీవుడ్ తారలు హైదరాబాద్ తరలి వచ్చారు.

హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటీమణులు బిపాసా బసు, దీపికా పదుకొణే, నటుడు సోనూసూద్ సందడి చేశారు. వీరిని చూసేందుకు, చేతులు కలిపేందుకు అభిమానులు ఆకస్తి కనబర్చారు. కాగా ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు తెలుగు వారియర్స్, ముంబయి హీరోస్ మధ్య సిసిఎల్ మ్యాచ్ జరుగనుంది.

కాగా, వారం క్రితం బెంగాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు వారియర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా సిలిగురిలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ టైగర్స్‌పై తెలుగు వారియర్స్‌ ఘనవిజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో టైగర్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ వారియర్స్‌ 68 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన వారియర్స్‌ 10.1 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+