
కేసులో నిందితుడైన పార్నెల్ పరారీలో ఉన్నట్లు చార్జిషీట్‌లో తెలిపారు. ఈ కేసులో 86 మంది నిందితులుగా పేర్కొంటూ 1,200 పేజీలీ చార్జిషీట్‌ను దాఖలు చేశారు. వారిలో 35 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు. వైద్య పరీక్షల తర్వాత వాళ్లు దేశం విడిచి వెళ్లారు.
నిందితుల్లో హోటల్ డైరెక్టర్ విషయ్ హండా, డిజెలు దీపేష్ శర్మ, రాకేష్ శర్మ కూడా ఉన్నారు. క్రికెటర్లు, యాక్టర్లు నిరుడు మే 20వ తేదీన జూహు ఓక్‌వుడ్ హోటల్లో పోలీసులకు పట్టుబడ్డారు. వారు మత్తపదార్థాలు సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
నిజానికి, పోలీసులు ఈ నెల 6వ తేదీననే చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందుతులైన క్రికెటర్లు రాహుల్ శర్మ, పార్నెల్ ఐపియల్‌లో పూణే వారియర్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.