Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి వరకు ఉత్కంఠ, డెన్మార్క్‌పై పోర్చుగల్ విజయం

Silvestre Varela
ఎల్‌వివ్, జూన్ 14: యూరో కప్‌లో పోర్చుగల్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు సత్తా చాటుకుంది. 'యూరో' ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన గ్రూప్ 'బి' లీగ్ మ్యాచ్‌లో విఖ్యాత స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 3-2 గోల్స్ తేడాతో డెన్మార్క్‌ను ఓడించింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

జర్మనీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 0-1తో ఓడిపోయిన పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడింది. పోర్చుగల్ స్ట్రయికర్ పెపె 24వ నిమిషంలో గోల్ చేసి ఖాతా తెరిచాడు. 36వ నిమిషంలో హెల్డెర్ పోస్టిగా గోల్ నమోదు చేయడంతో పోర్చుగల్ ఆధి క్యం 2-0కి పెరిగింది. అయితే, ఆ వెంటనే 41వ నిమిషంలో డెన్మార్క్ స్ట్రయికర్ నిక్లస్ బెండ్ట్‌నెర్ బంతిని గోల్‌పోస్టు లోకి పంపాడు. 80వ నిమిషంలో బెండ్ట్‌నెర్ మరో గోల్ సాధించడంతో స్కోరు 2-2తో సమమైంది. ఇక మ్యాచ్ 'డ్రా'గా ముగియడం ఖాయమనుకున్న తరుణంలో ఆట 87వ నిమిషంలో ఫాబియో కొయెంత్రాస్ అందించిన క్రాస్ పాస్‌ను అప్పుడే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సిల్వెస్టర్ వరేలా గోల్‌గా మలిచి పోర్చుగల్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.

యూరో 2012 జట్లు | రో 2012 మ్యాచ్‌లు

తొలి మ్యాచ్‌లో 2010 ప్రపంచ కప్ రన్నరప్ నెదర్లాండ్స్‌ను 1-0తో ఓడించి సంచలనం సృష్టించిన డెన్మార్క్‌పై... ఆరంభం నుంచే ఎదురుదాడులు చేస్తూ ఒత్తిడిలోకి నెట్టింది. స్టార్ ప్లేయర్ రొనాల్డో మెరుపు కదలికలతో ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. మధ్య భాగంలో చురుకుగా వ్యవహరిస్తూ సహచరులకు గోల్ చేసే అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నించాడు. కాగా ఈ గ్రూప్‌లో నెదర్లాండ్స్ మినహా మిగిలిన మూడు జట్లు జర్మనీ (3), డెన్మార్క్ (3), పోర్చుగల్ (3) తలా ఓ విజయం సాధించాయి. దీంతో ఇక ఈ గ్రూప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. బెర్తుల కోసం ఆఖరి లీగ్‌ల వరకు ఆగాల్సిందే.

యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 9.30 గంటలకు ఇటలీ వర్సెస్ క్రొయేషియా

రాత్రి 12.15 గంటలకు నుంచి స్పెయిన్ వర్సెస్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+