జ్వాలా టు భజ్జీ: అలా దృష్టి మరల్చుతున్నారు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆటల్లో ప్రతిభ చూపిన/చూపిస్తున్న పలువురు క్రీడాకారులు వెండితెర పైన కనిపించేందుకు ఉబలాడపడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల నుండి టెన్నిస్ తార మరియా పరషోవా వరకు, నాటి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నుండి స్పిన్నర్ హర్భజన్ సింగ్ వరకు అందరూ వెండితెర పైన కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో కొందరు ఫెయిలవుతుండగా మరికొందరు అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మాజీ భారత సారథి కపిల్ దేవ్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. కానీ, ఇప్పటి వరకు ఆ క్రికెట్ దిగ్గజంకు సరైన బ్రేక్ రాలేదు. భారత స్పిన్నర్ హర్భజన సింగ్ ఓ చిత్రంలో నటిస్తూ, నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. భజ్జీ క్రికెట్ తర్వాత సినిమా నిర్మాణ రంగంలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాక్సర్ విజేందర్ సిల్వర్ స్క్రీన్ పైన కనిపించనున్నాడు.
ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల... నితిన్ హీరోగా వస్తున్న గుండెజారి గల్లంతయిందే చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తిస్తున్నారు. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. పెళ్లికి ముందు సానియాకు పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి. పెళ్లయ్యాక ఆమె నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నా పెళ్లవడంతో తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే, గతంలో సానియా మీర్జా ర్యాంప్ వాక్‌లతో మతులు చెడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ర్యాంప్ వాక్‌లతో ఆమె యువతను ఆకట్టుకుంది. రష్యా క్రీడాకారిణి మరియా పరషోవా కూడా నటనపై ఆసక్తితో ఉంది. పలువురు క్రీడాకారులు తమ ఆటల తర్వాత వెండి తెరపై వెగిలిపోవాలని చూస్తున్నారు. దీంతో కొందరు అడుతూ.. మరికొందరు క్రీడా జీవితం ముగిశాక వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ముంబయిలో జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2012లో సానియా మీర్జా క్యాట్ వాక్

ముంబయిలో గతంలో జరిగిన ఫ్యాషన్ షోలో సానియా మీర్జా

సానియా ర్యాంప్ వాక్

స్టెప్పులేస్తున్న గుత్తా జ్వాల

హైదరాబాదులోని సారథి స్టూడియోలో షూటింగులో పాల్గొన్న గుత్తా జ్వాల

ఇటీవల గుత్తా జ్వాలా మరింత హాట్ హాట్‌గా కనిపిస్తున్నారు!

హర్భజన్ సింగ్ సినీ నిర్మాతగా, నటుడిగా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications