గర్ల్ ఫ్రెండ్‌ను చంపాలనుకోలేదు: ఏడ్చేసిన పిస్టోరియస్

విచారణ రేపటికి వాయిదా వడింది. దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం రేపు ఉదయం విచారణ తిరిగి ప్రారంభమవుతుంది. పథకం ప్రకారం ప్రిటోరియస్ తన గర్ల్ ఫ్రెండ్‌ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. బాత్రూం తలుపులు వేసేసి గర్ల్ ఫ్రెండ్‌ను హత్య ప్రిటోరియస్ హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు.
ప్రిటోరియస్‌కు బెయిల్ మంజూరు చేయలేమని, అతను పథకం ప్రకారం హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనని మెజిస్ట్రేట్ డెస్మండ్ నాయర్ చెప్పారు. తన ప్రియురాలు దాక్కున్న బాత్రూం తలుపులపైకి మాత్రమే తాను కాల్పులు జరిపినట్లు ప్రిటోరియస్ చెప్పాడు.
ప్రిటోరియస్ ఆయుధం ధరించి, తన ప్రొస్తెటిక్ లెగ్స్ తగిలించుకుని, ఏడు మీటర్లు నడిచి, నాలుగు సార్లు కాల్పులు జరిపాడని, మూసిన తలుపుల గుండా కాల్చడంతో స్టీవ్‌కాంప్ గాయపడి మరణించిందని ప్రాసిక్యూటర్ జెర్రీ నెల్ వాదించారు. వాలంటైన్స్ డేనాడు పిస్టోరియస్ తన ప్రియురాలిని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. మాస్క్‌తో రావడం వల్ల ప్రియురాలిని గుర్తించకుండా దొంగగా భావించి ప్రిటోరియస్ కాల్పులు జరిపినట్లు, దాంతో ఆమె మరణించినట్లు మొదట భావించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications