
తనపై పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైద్య నిపుణుల నివేదికలోని చివరి పేరాలో తనకు అత్యాచారం చేసే సామర్థ్యం లేదని ఉందన్నారు. పోలీసులు ఈ విషయాన్ని మరుగున పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల చర్య ఆత్మహత్యను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు.
కాగా కామన్‌వెల్త్ క్రీడల పతక విజేత పింకీ ప్రామాణిక్ కేసు మలుపు తిరిగిన విషయం తెలిసిందే. డిఎన్ఎ పరీక్షల అనంతరం పురుషుడిగా నిర్దారించి పింకీ ప్రామాణిక్‌పై పోలీసులు రేప్ కేసు పెట్టారు. అయితే, ఈ కేసును వైద్య నిపుణులు ప్రశ్నించారు. పింకీ డిజార్డర్ ఆఫ్ సెక్సువల్ డెవలప్‌మెంట్ (డిఎస్‌డి) సమస్య ఉన్నట్లు వైద్య నిపుణులు తేల్చారు. దానివల్ల పింకీ ప్రామాణిక్ సంభోగం చేయలేడని అంటున్నారు.
డిఎన్ఎ నివేదికలో ఎక్స్‌వై క్రోమోజోమ్స్ కారణంగా పురుషుడిగా నిర్ధారించినప్పటికీ అటువంటి రోగులు లైంగిక క్రీడ జరపలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. పింకీపై రేప్ కేసు పెట్టడం అన్యాయమని అంటున్నారు. డిఎస్‌డితో బాధపడుతున్నవారిని పురుషులుగా పరిగణంచలేమని చెబుతున్నారు. అయితే, పింకీ రక్తప్రసరణను బట్టి అంగస్తంభన జరుగుతుందని తేలిందని పోలీసులు అంటున్నారు.
పాక్షికంగా లైంగిక క్రీడ జరిపే శక్తి ఉన్నా కూడా రేప్ కేసు పెట్టడానికి వీలుందని చెబుతున్నారు. మహిళపై అత్యాచారం చేయడానికి సంభోగమే చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో మహిళా విభాగంలో పతకం సాధించిన పింకీ ప్రామాణిక్ మహిళ కాదని, పురుషుడని వైద్య పరీక్షల్లో తేలడంతో కోల్‌కత్తా పోలీసులు సోమవారం రేప్ కేసు నమోదు చేశారు. పింకీపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు.