రేప్ గొడవ నుంచి ఊరట: తిరిగి రైల్వేలోకి వచ్చిన పింకీ

దోహాలో 2006లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె మహిళా విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తీవ్రమైన మానసిక సంక్షోభం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం ఎంతో ఊరటనిచ్చిందని పింకీ ప్రామాణిక్ చెప్పారు. తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకున్నందుకు ఆమె రైల్వేకు కృతజ్ఞతలు తెలిపింది. తనను తిరిగి తన ఉద్యోగంలో నియమించాలని ఆగస్టు 8వ తేదీన కోరానని, వెంటనే దానికి సానుకలమై ఆదేశాలు వచ్చాయని, నిన్న ఉద్యోగంలో చేరానని పింకీ ప్రామాణిక్ చెప్పారు.
తన సహోద్యోగులు ఎంతో సహకరిస్తున్నారని, తనను ఎంతో గౌరవిస్తున్నారని, చాలా మంది తనతో ఫొటోలు దిగుతున్నారని ఆమె సంతోషంగా చెప్పారు. బెయిల్ ఆర్డర్ ప్రతిని సమర్పించిన తర్వాత తిరిగి పింకీ ప్రామాణిక్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నామని రైల్వే శాఖ అధికారులు చెప్పారు.
కస్టడీలో 48 గంటల పాటు ఉంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్యోగం కోల్పోతారు. బెయిల్ లభించిన తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. రేప్ ఆరోపణలు రావడంతో పోలీసులు పింకీ ప్రామాణిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో 48 గంటలకు పైగా ఉండడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications