Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బికినీ వేసినందుకే.. ఒకే గదిలో లేకుండా చేశారు

Olympics: Husband and wife ban hits the Marks
లండన్, జులై 18: ఎంతో ఉత్సాహాంగా లండన్ ఒలంపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆస్టేలియా షూటర్ రస్సెల్ మార్క్ ఒక్కసారిగా యాంగ్రీ మ్యాన్‌గా మారిపోయాడు. ఇందుకు కారణం లండన్ ఒలంపిక్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఒలంపిక్స్ విలేజిలో వీరిద్దరూ ఒకే గదిలో ఉండకూడదని ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం (ఏఓసీ) హుకం జారీ చేయడమే. దీంతో ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం (ఏఓసీ)పై రస్సెల్ తీవ్రంగా మండిపడ్డాడు.

తనకు వచ్చిన కోపాన్ని ఆపుకోకుండా ఒలింపిక్ విలేజ్‌లో ఎంతో మంది గే (స్వలింగ సంపర్కులు)లు కలిసి ఉంటున్నారు. మాది వివాహమైన జంట. మేం ఒకే గదిలో ఉంటే తప్పేంటి.. అంటూ ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం (ఏఓసీ) ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని రస్సెల్ ధ్వజమెత్తాడు. భర్త అభిప్రాయంతో లారిన్ కూడా జత కలిపి స్ట్రేలియా ఒలింపిక్ సంఘాన్ని దుయ్యబట్టారు.

ఇంతకీ వీరిద్దరిని ఒకే గదిలో ఉండకూడదని చెప్పడానికి గల కారణాలను విశ్లేషిస్తే రస్సెల్ నిద్ర మాత్రలను వాడుతుండటం, లారిన్, రస్సెల్ ఇద్దరూ కలిసి 'జూ మ్యాగజైన్' కవర్ పేజిపై హాట్‌హాట్‌గా ఫొటోలు ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘానికి కోపం తెప్పించింది. ఈ ప్రక్కనున్న చిత్రంలో గనుక మీరు గమనించినట్లైతే లారిన్ గ్రీన్ మరియు గోల్డ్ బికినీలో ఫోజు లిచ్చింది. ఈ కారణంగానే ఈ జంటను విడివిడిగా ఉంచాలని వారు నిర్ణయం తీసుకున్నారు.

48 సంవత్సరాల వయసు కలిగిన రస్సెల్ మార్క్ ఆరోసారి పాల్గొంటున్న ఒలంపిక్స్ లండన్ ఒలంపిక్స్. డబుల్ ట్రాప్ షూటరైన రస్సెల్ 1996 (అట్లాంటా) ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2000 (సిడ్నీ) ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+