చరిత్ర సృష్టించిన ఉసేన్ బోల్ట్, 200మీటర్లలో స్వర్ణం

ఈ గెలుపుతో బోల్ట్ ఒలింపిక్స్‌లో మరో ఘనతను అందుకున్నాడు. ఉసేన్ బోల్ట్ 200 మీటర్లలోనూ సత్తా చాటడం ద్వారా వరుసగా రెండుసార్లు 100 మీటర్లు, 200 మీటర్ల రేస్‌లో సరిక్రొత్త ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 200మీ పరుగు పందెంలో మొదటి మూడు స్థానాల్లోను జమైకా అథ్లెట్లే నిలవడం విశేషం. అయితే ఈసారి బోల్ట్ గతంలో తాను నెలకొల్పిన ఒలింపిక్ రికార్డు, వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమయ్యాడు.
బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా బోల్ట్‌కు 100 మీ., 200మీటర్ల పరుగు పందెంలో స్వర్ణాలు దక్కాయి. తద్వారా స్ప్రింట్స్ (100మీ., 200మీ.)లో కార్ల్ లూయీస్ (3 స్వర్ణాలు, 1 రజతం) నెలకొల్పిన అత్యధిక స్వర్ణాల రికార్డును కూడా బోల్ట్ అధిగమించాడు. తాజా విజయంతో కెరీర్‌లో ఓవరాల్‌గా బోల్ట్ ఐదో ఒలింపిక్ స్వర్ణాన్ని నెగ్గగా...స్ప్రింట్‌లో మాత్రం ఇది నాలుగోది. మరో పసిడిని బీజింగ్‌లో 4/100 మీ. రిలేలో గెలిచిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications