Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్ ఒలంపిక్స్ 2012లో హైదరాబాదీల సత్తా..!

Gagan Narang
న్యూఢిల్లీ: క్రీడాకారులైన ప్రతి ఒక్కరికీ ఒలంపిక్స్‌లో పాల్గొనాలనేది చిరకాల వాంఛ. ఒలంపిక్స్‌లో పాల్గొనాలనే తాపత్రయంతో కఠోర సాధనకై ఎమి చేయడానికైనా సిద్దపడతారు. ఈసారి లండన్‌లో జులై 27 నుండి జరగనున్న లండన్ ఒలంపిక్స్‌లో మన హైదరాబాద్ నుండి ఎవరెవరు వెళుతున్నారో ఒక్కసారి చూద్దామా..? ఈసారి అందరి అంచనాల ప్రకారం రెండు రంగాల్లో పతకం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ రెండు క్రీడాంశాలు ఏమిటంటే ఒకటి షూటింగ్, రెండవది టెన్నిస్.

షూటింగ్ విభాగంలో మన హైదరాబాదీ గగన్ నారంగ్ పాల్గొనుతుండగా.. టెన్నిస్‌లో సానిమా మిర్జా (మిక్స్‌డ్‌లో పేస్‌తో కలసి)పైనా అంచనాలున్నాయి. గత రెండు ఒలింపిక్స్‌ల్లో దురదృష్టం వెంటాడిందని వాపోయిన గగన్ నారంగ్ ముచ్చటగా ఒలింపిక్స్ బరిలో దిగుతున్నాడు. గతంలో జరిగిన రెండు ఒలింపిక్స్ (ఏథెన్స్, బీజింగ్)లలో అదృష్టం తన పక్షాన లేదని, ముచ్చటగా మూడో ప్రయత్నంలో పతకం సాధిస్తానని భారత షూటర్ గగన్ నారంగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

రెండు సార్లు((2004 ఏథెన్స్, 2008 బీజింగ్)) నాకు అదృష్టం కలిసి రాలేదు. లండన్‌లో పతకం సాధించి చిరకాల స్వ ప్నం నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు. మూడోసారి అదృష్టం కలిసొస్తుందని ఆశిస్తున్నా. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ప్రతీ క్రీడాకారుడి అంతిమ లక్ష్యం. నా కలను సాకా రం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా అని నారంగ్ అన్నాడు. 208లో ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో ఫైనల్ కూడా చేరలేకపోయిన గగన్, ఈ సారి 50 మీ. రైఫిల్ ప్రోన్, 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్‌లలో కూడా పోటీ పడుతున్నాడు.

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాల పంట పండించాడు. 2008లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాజాగా లండన్ గేమ్స్‌లో నారంగ్ పతకం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత షూటింగ్ బృందానికి నారంగ్‌తో పాటు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా, రంజన్ సోధీ తదితర స్టార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇటీవలి కాలంలో నారంగ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు స్వర్ణాలతో మెరిసిన హైదరాబాదీ ఆనక ఆసియా గేమ్స్‌లో రెండు రజతాలు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోని అందరి దృష్టీ ఒలింపిక్స్‌పైనే ఉంటుంది. గత అనుభవం వల్ల కీలక సమయాల్లో ఎలా ఆడాలో నాకు తెలుసు అని ఈ షూటర్ వివరించాడు. బీజింగ్ వైఫల్యం అనంతరం గగన్ బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో 703.5 పాయింట్లతో కొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. క్వాలిఫయింగ్‌లో 600/600 స్కోరు కూడా చేయడం విశేషం.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+