ఒలింపిక్స్‌లో డోపీగా తేలడంతో.. స్వర్ణం వెనక్కి: ఐఓసీ

31 ఏళ్ల ఒస్టాప్‌చుక్ ఇచ్చిన రెండు యూరిన్ శాంపిల్స్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో లండన్ క్రీడల్లో డోపీగా తేలిన మొదటి పతక విజేతగా ఒస్టాప్‌చుక్ నిలిచింది. గతంలో ఏథెన్స్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం, బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన ఈమెకు ఇవి మూడో ఒలింపిక్స్. 2005 ప్రపంచ చాంపియన్ అయిన ఈమె ఈ నెల 6న జరిగిన పోటీలో షాట్‌పుట్‌ను 21.36 మీ. దూరం విసిరి.. మూడు సార్లు ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ అయిన ఆడమ్స్ (20.70 మీ)ను ఓడించింది.
దీంతో మహిళల షాట్‌పుట్ స్వర్ణ పతకాన్ని న్యూజిలాండ్‌కు చెందిన వలెరీ ఆడమ్స్‌కు, రజత పతకాన్ని రష్యాకు చెందిన ఎవగెనియా కొలోడ్కోకు, కాంస్య పతకాన్ని చైనాకు చెందిన గాంగ్ లిజియోకు ప్రదానం చేయనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ప్రకటించింది.
తెలుగు వన్ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications