
పరస్కెవి తన ట్విట్టర్ అకౌంట్‌లో 'గ్రీసులో చాలామంది ఆఫ్రికన్లు ఉన్నారు... పోనీలే.. వెస్ట్ నైల్ దోమలు ఇంటి తిండి తింటాయి' అంటూ చేసిన పోస్టు వివాదాస్పద మైంది. గ్రీసులో ఈ నెలలో వెస్ట్‌నైల్ వైరస్ సోకి ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురికి ఈ వైరస్ సోకింది.
ఈ నేపథ్యంలో గ్రీస్‌లో నివసించే ఆఫ్రికన్లపై ఆమె చేసిన జోక్ జాతి వివక్షతో కూడి ఉందని పలు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆమెను ఒలింపిక్స్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశాయి. దాంతో తప్పు తెలుసుకున్న ఆమె 'అది అనాలోచితంగా వేసిన పనికిమాలిన జోక్. నేనెవర్నీ అవమానపరచాలని అనుకోలేదు' అంటూ పలురకాలుగా క్షమాపణలు చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. గ్రీక్ ఒలింపిక్స్ టీం హెడ్ పరస్కెవిపై వేటు వేసినట్లు అధికారికంగా తెలిపారు.
తెలుగు వన్ఇండియా