Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్ క్వాలీఫైర్స్: ఇటలీపై 8-1 తో ఘనవిజయం

Sandeep shines as India maul Italy 8-1
న్యూఢిల్లీ: హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌‌లో భారత్ హవా కొనసాగుతోంది. టోర్నీని ఘనంగా ఆరంభించిన భారత పురుషుల జట్టు తన జోరు కొనసాగించింది. పురుషుల విభాగంలో ఆదివారం ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఇటలీతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 8-1తో ఘనవిజ యం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో భారత ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ విరామానికి 6-1 ఆధిక్యం సాధించారు.

కాగా ద్వితీయార్ధంలో భారత్ రెండే గోల్స్ సాధించింది. ఇటలీకి నిరాశ ఎదురైంది. భారత ఆటగాళ్లు సందీప్ సింగ్ (4, 22, 23వ నిమిషాల్లో) మూడు, సునీల్ (30, 38వ) రెండు గోల్స్ సాధించారు. రఘునాథ్ (12వ), గుర్విందర్ చాందీ (32వ), శివేందర్ సింగ్ (52వ) ఒక్కో గోల్ చేశారు. సునీల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ద క్కింది. కాగా ఇటలీ తరపున అలెశాండ్రో నన్నీ ఏకైక్ గోల్ కొ ట్టాడు. 41వ ర్యాంకర్ ఇటలీకి ఈజిప్టు స్థానంలో ఎంట్రీ ల భించింది.

తొలి మ్యాచ్‌లో భారత్ 15-1తో సింగపూర్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు వరుస విజయాలు సాధించిన భారత్ (6) పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫ్రాన్స్ కూడా ఆరే పాయింట్లు సాధించినా గోల్స్ సంఖ్యలో తేడా వల్ల ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో పోలెండ్ 3-2తో కెనాడాను, ఫ్రాన్స్ 9-0తో సింగపూర్‌పై గెలుపొందాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+