Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు గోల్స్‌ చేసిన రొనాల్డో, క్వార్టర్ ఫైనల్‌కు పోర్చుగల్

Ronaldo
ఖార్కివ్ (ఉక్రెయిన్), జూన్ 19: పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డో కీలక మ్యాచ్‌లో అద్బుతంగా రాణించి రెండు గోల్స్ చేసి, పోర్చుగల్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 'యూరో కప్-2012' ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్‌ను క్వార్టర్ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ 'బి' చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేని రొనాల్డో ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ (28వ, 74వ నిమిషాల్లో) సాధించి జట్టుకు అద్బుతమైన విషయాన్ని అందించాడు.

ఇక నెదర్లాండ్స్ తరఫున వాన్ డెర్ వార్ట్ (11వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. 2010 ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచిన నెదర్లాండ్స్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో పోర్చుగల్ సత్తా చాటింది. అదృష్టం కలసొచ్చి ఉంటే రొనాల్డో ఖాతాలో మరో రెండు గోల్స్ చేరేవి. అతను కొట్టిన రెండు షాట్‌లు గోల్‌పోస్ట్‌కు తగిలి తిరిగి వచ్చాయి. ఆట 11వ నిమిషంలో వాన్ డెర్ వార్ట్ ఎడమకాలితో కొట్టిన షాట్ నేరుగా పోర్చుగల్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో నెదర్లాండ్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

ఆ తర్వాత ఆట 24వ నిమిషంలో పెడ్రో పెరీరా అందించిన పాస్‌ను అందుకున్న రొనాల్డో, నెదర్లాండ్స్ ఆటగాళ్లు అడ్డుకునేలోపు 'డి'ఏరియాలోకి వచ్చిన రొనాల్డో బలమైన షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్కోరు 1-1వద్ద సమమైంది. రెండో అర్ధభాగంలో పోర్చుగల్ మరింత జోరును పెంచింది. ఆట 74వ నిమిషంలో మధ్యభాగం నుంచి నాని నెదర్లాండ్స్ 'డి' ఏరియా ఎడమవైపున ఉన్న రొనాల్డోకు పాస్ ఇచ్చాడు. రొనాల్డో తన పక్కనే ఉన్న నెదర్లాండ్స్ ఆటగాడు గ్రెగరీ వాన్ డెర్ వీల్‌ను ఏమార్చి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించడంతో పోర్చుగల్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ స్కోరును సమం చేసేందుకు యత్నించి విఫలమైంది.

యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు ఇంగ్లండ్ వర్సెస్ ఉక్రెయిన్

రాత్రి 12.15 గంటలకు నుంచి ఫ్రాన్స్ వర్సెస్ స్వీడన్

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+