చలి తీవ్రత ఎక్కువగా ఉంది... బికినీలతో ఆడలేం

బీచ్ వాలీబాల్ ఆట జరిగే సమయంలో టీవీ రేటింగ్‌లూ వేగంగా పెరిగిపోతాయి. కానీ ఇప్పుడు లండన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఈ బీచ్ వాలీబాల్ ఆటలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేమిటంటే అమెరికా జంట కెర్రీ వాల్ష్ జెన్నింగ్స్- మిస్టీ మే ట్రెనర్‌లు శనివారం రాత్రి 11 గంటలకు తీవ్రమైన చలిలో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అసలే రాత్రి... ఆపై 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. ఇంకేముంది...ఈ చలిలో బికినీ మా వల్ల కాదంటూ వారిద్దరూ పొడవాటి చేతులు ఉన్న షర్ట్‌లు ధరించి బరిలోకి దిగారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ స్వర్ణాలు గెల్చుకున్న ఈ జోడి 21-18, 21-19 తేడాతో నటాలీ-టాస్మిన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఆసీస్ జంట అయితే మరో అడుగు ముందుకేసింది. ఏకంగా పొడవాటి ప్యాంట్‌లు, చిన్న షర్ట్ ధరించి కోర్టులోకి దిగారు. ఇది మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులను నిరాశపర్చింది. అయితే చలి తగ్గితే తాము బికినీలో ఆడతామని ఆ క్రీడాకారిణులు మాట ఇస్తున్నారు. ప్లేయర్లు మానేసినా టైమౌట్‌ల సందర్భంగా డ్యాన్స్ టీమ్‌లు అదే స్థాయిలో టూ పీస్ బికినీలతో అభిమానులను ఆనందం పర్చాయి.
తెలుగు వన్ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications