
తొలి మ్యాచ్‌లో డెన్మార్క్ 1-0తో నెదర్లాండ్స్ పై గెలిచిన తరుణంలో ఈ మ్యాచ్ నెదర్లాండ్స్‌కు చావో రేవోగా మారింది. దీంతో జర్మనీపై తప్పక గెలవాల్సిన పరిస్దితి. పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ గెలుపొందడంతో మూడు పాయింట్లతో కొనసాగుతుంది. యూరో టోర్నమెంట్‌లో గెలవాలంటే దూకుడైన ఆటతీరు ఎంతైనా అవసరం.
యూరో-2012 లాంటి మెగాటోర్నీలో తొలి మ్యాచ్ ఏ జట్టుకయినా చాలా క్లిష్టం. ప్రత్యేకించి టైటిల్ ఫేవరెట్ జట్లకు ఇది మరింత కఠినమైంది. నెదర్లాండ్స్‌లో విల్ ఫ్రెడ్ బౌమా, జోరిస్ మాతిజ్ సేన్, జెట్రో విలియమ్స్, రాన్ వ్లార్, జాన్ హెటిజ్నింగా లాంటి అధ్బుతమైన డిఫెండర్స్ ఉన్నప్పటికీ ఆటలో సరైన ప్రణాళికలను రచించ లేక పోతున్నారు.
యూరో మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైతే.. ఇంటికి వెళ్లడం మంచిది. ఎందుకంటే టోర్నీ ఆరంభంలోనే ఓడిన జట్లకు నాకౌట్ చాన్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక జర్మనీతో ఈరోజు జరిగే మ్యాచ్ నెదర్లాండ్స్‌కు చావో రేవో లాంటింది. తప్పక గెలవాలి. ఒకవేళ డ్రా అయినా వారి అవకాశాలు సన్నగిల్లినట్టే.! ఇక అదృష్టం కొద్దీ పోర్చుగల్‌పై 1-0తో నెగ్గిన జట్టు జర్మనీ. నెదర్లాండ్స్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ జర్మనీ గెలుస్తుందనే అభిమానులు ఆశిస్తున్నారు.
జట్ల వివరాలు:
నెదర్లాండ్స్: స్టీక్లెన్ బర్గ్-వాన్ డెర్ వెయిల్, హెటిగ్నా, బౌమా, విలియం డి జాంగ్, వాన్ బోమ్మెల్, రాబిన్, స్నిజ్డెర్, వాన్ పెర్సీ ఎపెల్లీ.
జర్మనీ: న్యూర్-బోటెంగ్, హామ్మాల్స్, బాడ్ స్టబ్బర్, కేడిరా-లామ్, సెవిండ్జర్, ముల్లర్, ఓజిల్, పోడోస్కోల్కి, గోమేజ్.
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 9.30 గంటలకు డెన్మార్క్ వర్సెస్ పోర్చుగల్
రాత్రి 12.15 గంటలకు నుంచి నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీ
తెలుగు వన్ఇండియా