
మంగళవారం రాత్రి ముంబైకు చేరున్న గగన్ నారంగ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బుధవారం పుణేలోని 'గన్ ఫర్ గ్లోరి' అకాడమీలో గగన్‌ను మహారాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి పద్మాకర్ వాల్వి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంలో లండన్‌లో పాల్గొన్న మహిళా షూటర్ రహీ సర్నోబాత్‌తోపాటు గగన్ తల్లిదండ్రులను కూడా సన్మానించారు. గగన్ నారంగ్ మాట్లాడుతూ లండన్ ఒలింపిక్స్‌లో తాను పోటీచేసిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఒత్తిడి లోనయ్యానని గుర్తు చేసుకున్నాడు.
ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు గాను కోచ్ స్టానిస్లాస్ లాపిడస్ ఐప్యాడ్‌తో కాలక్షేపం చేశానన్నాడు. 'పోటీకి ముందు నెర్వస్‌గా ఫీలయ్యాను. నా కోచ్ తన ఐప్యాడ్ ఇచ్చి 'సీక్రెట్' గేమ్ ఆడమని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాను. నిజానికి ఓ అరగంట ముందే ఐప్యాడ్ చేతికి వచ్చి ఉంటే స్వర్ణం సాధించేవాణ్ణేమోనని నవ్వుతూ అన్నాడు. ఫైనల్స్‌కు అర్హత సాధించానని తెలియగానే పెద్ద భారం దిగినట్టయింది. ఇక ఫైనల్లో చివరి షాట్‌ను 10.2 కొడితే కాంస్యం ఖాయమైన దశలో 10.7 కొట్టడం అదృష్టంగా భావించాను' అని గగన్ చెప్పాడు.
బీజింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణంతోపాటు మరో రెండు కాంస్యాలు, ప్రస్తుతం లండన్‌లో నాలుగు పతకాలు రావడం భారత్ భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించగలుగుతుందని అని గగన్ అన్నాడు. యుద్ధాలతో పనిలేకుండా క్రీడలే దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ తాయని అభిప్రాయపడ్డాడు. ఇది ఇలా ఉంటే విజయ్ కుమార్, గగన్ నారంగ్‌లకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏఐ) నజరానాను ప్రకటించింది. రజతం సాధించిన విజయ్‌కు రూ.25 లక్షలు, కాంస్యం గెలుచుకున్న గగన్ నారంగ్‌కు రూ.15 లక్షలు అందిస్తామని తెలిపింది.
తెలుగు వన్ఇండియా