
ఇదిలావుంటే, బాక్సర్ రాంసింగ్‌పై వేటు పడింది. తరుచుగా హెరాయిన్‌ను తీసుకుంటామని చెప్పిన రాంసింగ్‌ను పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బహిష్కరించారు. జాతీయ మాజీ చాంపియన్ అయిన రామ్ సింగ్- తాను, ఒలింపిక్ బాక్సర్ విజేందర్‌సింగ్‌తో కలిసి ప్రయోగాత్మకంగా డ్రగ్స్ తీసుకునేవారమని చెప్పాడు. వాటిని తమ శక్తిని పెంపొందించడానికి వీలుగా ఆహారపదార్ధంగా భావించి తీసుకున్నామని రాంసింగ్ చెప్పడం జరిగింది. వీటి అన్నింటికి ఫతేగఢ్ సాహిచ్‌లోని అనూప్‌సింగ్ అనే ప్రవాస భారతీయుడి ఫ్లాట్‌లో 130 కోట్ల రూపాయాల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో విజేందర్ సతీమణి కారు ఆ ఇంటి బయట ఉండడంతో పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో ఈ వివరాలన్నీ రాంసింగ్ బయట పెట్టడం జరిగింద. రామ్‌ను తాత్కాలికంగా ఎన్‌ఐఎస్ నుంచి బహిష్కరించామని జాతీయ బాక్సింగ్ కోచ్ అయిన గుర్బాక్స్ సింగ్ సంధు తెలిపారు. విజేందర్‌ను తాను 10 సంవత్సరాలుగా ఎరుగుదునని, పలు డోపింగ్ టెస్ట్‌లను ఎదుర్కొ న్నాడని, ఎప్పుడూ క్లీన్‌గా ఉన్నాడని అతను చెప్పాడు.
తాను పనిచేసిన బాక్సర్లలో అతడు క్రమశిక్షణ కలిగిన వాడని అన్నారు. విచారణ పూర్తి అయ్యేంతవరకు ఎదురుచూడాల్సి ఉందని, అప్పటివరకు ఆరోపణలు చేయడం సరిగాదన్నాడు. 2008 ఒలింపిక్ గేమ్స్‌లో తొలిగా పతకాన్ని అందించిన విజేందర్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం, కామన్వెల్త్‌గేమ్స్‌లోనూ పతకాన్ని గెలుచుకుని వచ్చాడు.
నాడా పాత్ర లేదు
విజేందర్ కేసును పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇందులో తమ పాత్ర ఏమీలేదని డోపింగ్ వ్యతిరేక ఏజెన్పీస నాడా స్పష్టం చేసింది. పోటీల సమయం కాకుండా నాడా పరీక్షలు చేయదని సంబంధిత వర్గాలు తెలిపాయి.