Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వర్ణం సాధించి.. కూలికెళ్తోన్న మాజీ ఆర్చర్‌కు కేంద్ర రూ. 5లక్షల సాయం

Sports Ministry sanctions of Rs. five lakh for former archer Ashok Soren

హైదరాబాద్: మాజీ ఆర్చర్ అశోక్ సోరెన్ దీనగాథ తెలుసుకున్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రూ. 5 లక్షల ప్రభుత్వం సాయం ప్రకటించారు. వివరాల్లోకి వెళితే... జంషెడ్‌పూర్‌కు చెందిన మాజీ ఆర్చర్ అశోక్ సోరెన్ కాలం కలిసిరాక బతుకుదెరువు కోసం ఇప్పుడు కూలీ పనులు చేసుకుంటున్నాడు.

2008 దక్షిణాసియా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన 28 ఏళ్ల అశోక్ సోరెన్ దీనగాథను సోషల్ మీడియా ద్వారా పలువురు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాధోడ్ ఓదార్పుగా రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

"పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ పథకం (క్రీడారుల విభాగం) నుంచి సోరెన్‌కు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ప్రస్తుతం సోరెన్ ప్రస్తుతం జంషెడ్‌పూర్‌లో నిరుపేదరికాన్ని ఎదుర్కొంటున్నాడు" అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

అంతకముందు నరాల బలహీనతతో బాధ పడుతున్న అర్జున అవార్డు గ్రహీత లింబారామ్‌కు, జులై నెల ఆరంభంలో అనారోగ్యంతో బాధ పడుతున్న ఆర్చర్ గోహెల బోరోకు కేంద్రం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, July 25, 2018, 12:50 [IST]
Other articles published on Jul 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+