
హైదరాబాద్: 2018కి రాజీవ్ ఖేల్‌రత్నను అందుకునేందుకు వందశాతం అర్హత ఉన్నా, కొన్ని కారణాల రీత్యా ఎంపిక కాలేకపోయిన స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్‌కు ఊరటనిచ్చే వార్త. ఇటీవలి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేతలైన ఈ ఇద్దరూ దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి నామినేట్ అయ్యారు. ఇటీవల ఖేల్‌రత్న ఎంపిక ప్రక్రియలో మిగతా వారికంటే ఎక్కువగా బజరంగ్, వినేశ్‌లు చెరో 80 పాయింట్లు సాధించినా ప్రయోజనం లేకుండా పోయింది.
క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానును ఖేల్‌రత్నకు ఎంపికచేయడం వివాదాస్పదమైంది. ఖేల్‌రత్న తమకు దక్కనందుకు కోర్టుకి వెళ్లేందుకు కూడా సిద్ధమైన పూనియా... ఆ తర్వాత తన గురువు, మెంటర్ యోగేశ్వర్ దత్ సూచన మేరకు ఆ ఆలోచనను విరమించుకుంది. భజరంగ్ పూనియాకి ఖేల్‌రత్న ఇవ్వకపోవడంపై క్రీడాశాఖపై అనేక విమర్శలు చెలరేగాయి.
దాంతో తన తప్పును సవరించుకునే చర్యలను ప్రారంభించింది క్రీడాశాఖ. ఖేల్‌రత్న అవార్డ్ పొందేందుకు నూరు శాతం అర్హతలు ఉన్నప్పటికీ, కొన్ని కారణాల రీత్యా ఆ పురస్కారాన్ని మిస్ అయిన భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియాకి దేశ నాలుగో అత్యున్నత పురస్కారం 'పద్మశ్రీ' అవార్డుకి నామినేట్ చేసింది.
ఆయనతో పాటు ఏషియాడ్ గోల్డ్ మెడలిస్ట్ వినేశ్ ఫోగట్ కూడా 'పద్మ'పురస్కారాలకు నామినేట్ అయ్యారు. ఖేల్‌రత్న అవార్డ్ ఎంపిక ప్రక్రియలో క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులను ఎంపిక చేసిన క్రీడాశాఖ... 80 పాయింట్లు సాధించిన భజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌లకు విస్మరించిన విషయం తెలిసిందే.