
డిఎన్ఎ నివేదికలో ఎక్స్‌వై క్రోమోజోమ్స్ కారణంగా పురుషుడిగా నిర్ధారించినప్పటికీ అటువంటి రోగులు లైంగిక క్రీడ జరపలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. పింకీపై రేప్ కేసు పెట్టడం అన్యాయమని అంటున్నారు. డిఎస్‌డితో బాధపడుతున్నవారిని పురుషులుగా పరిగణంచలేమని చెబుతున్నారు.
అయితే, పింకీ రక్తప్రసరణను బట్టి అంగస్తంభన జరుగుతుందని తేలిందని పోలీసులు అంటున్నారు. పాక్షికంగా లైంగిక క్రీడ జరిపే శక్తి ఉన్నా కూడా రేప్ కేసు పెట్టడానికి వీలుందని చెబుతున్నారు. మహిళపై అత్యాచారం చేయడానికి సంభోగమే చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కామన్‌వెల్త్ క్రీడల్లో మహిళా విభాగంలో పతకం సాధించిన పింకీ ప్రామాణిక్ మహిళ కాదని, పురుషుడని వైద్య పరీక్షల్లో తేలడంతో కోల్‌కత్తా పోలీసులు సోమవారం రేప్ కేసు నమోదు చేశారు. పింకీపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. రేప్ ఆరోపణపై పింకీని పోలీసులు జూన్ 14వ తేదీన అరెస్టు చేశారు.
ఆసియా కామన్‌వెల్త్ స్వర్ణ పతక విజేత అయిన అథ్లెట్ పింకీ ప్రామాణిక్ అప్పటి నుంచి కష్టాల్లో పడ్డాడు. పింకీ ప్రామాణిక్ పురుషుడని, ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పింకీ ప్రామాణిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనపై పింకీ ప్రామాణిక్ అత్యాచారానికి పాల్పడినట్లు పింకీతో సహజీవనం చేసిన 30 ఏల్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.