
దీంతో లండన్ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగు పతకాలు సాధించింది. ఇది మాత్రమే కాకుండా ఒలింపిక్ చరిత్రలో తొలిసారి భారత్ నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. ఒలంపిక్స్‌లో తొలిసారి మహిళల బాక్సింగ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. మేరీ కామ్ ఒలంపిక్స్‌లో పతకం సాధించి, దేశ చరిత్రలో ఒలింపిక్ పతకం సాధించిన మూడవ మహిళగా చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించగా.. లండన్ ఒలంపిక్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌కు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తన ట్విట్టర్‌లో మేరీ కామ్ మ్యాచ్ చూసేందుకు చాలా ఉత్సకతతో ఎదురు చూస్తున్నాం. ఆమెను చూస్తే నిజంగా గర్వంగా ఉంది. ఇండియాలో ఉన్న ఆడవారికి మేరీ కామ్ రోల్ మోడల్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా మేరీ కామ్ మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నాను. మీ అందరికి ధన్యవాదాలు. నా దేశం గర్వించేలా చేస్తానని ఆశిస్తున్నాను. జై హింద్! అంటూ రీట్వీట్ చేసింది.
లండన్ ఒలింపిక్స్ గేమ్స్ సందర్బంగా మేరీ కామ్ మాట్లాడుతూ ఒలింపిక్స్ అనేవి ప్రతి ఒక్కరికి ప్రత్యేకం. ఒలింపిక్స్ గేమ్స్‌లో ప్రతి ఒక్క అథ్లెట్ విజయం సాధించాలని కోరుకుంటాడు. ఇది నా 12 వ పోరాట సంవత్సరం. ఒలంపిక్స్‌లో పాల్గోనలే ఉద్దేశ్యంతో నా రిటైర్ మెంట్ యోచనను విరమించుకోని నా బరువుని తగ్గించుకున్నానని చెప్పింది.
సోమవారం జరిగిన లండన్ ఒలింపిక్స్ పోటీల్లో ఆమె ఈ విజయం సాధించింది. మేరీ కోమ్ టునీషియాకు చెందిన మరోవా రహాలీని 15-6 స్కోరుతో క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. 29 ఏళ్ల మేరీ కోమ్ తన ప్రత్యర్థిపై పూర్తిగా పైచేయి సాధించింది. నాలుగు రౌండ్లలో ఆమె 2,3,6,4 పాయింట్లు సాధించగా, రహాలీ 1,2,,2 పాయింట్లు సాధించింది.
తెలుగు వన్ఇండియా