For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదేళ్ల తర్వాత యుఎస్ ఓపెన్‌ క్వార్టర్స్‌లోకి 'షరపోవా'

By Nageswara Rao
Sharapova
న్యూయార్క్, సెప్టెంబర్ 4: గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రష్యా టెన్నిస్ క్రీడాకారణి మరియా షరపోవా యుఎస్ ఓపెన్‌లో ఐదేళ్ల తర్వాత ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2006లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక షరపోవా ఆ తర్వాత ఐదేళ్ళ పాటు నాలుగో రౌండ్‌ను దాటలేదు. కానీ ఈ ఏడాది క్వార్టర్ పైనల్స్ లోకి అడుగుపెట్టి టైటిల్ దిశగా ముందుసాగుతుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ షరపోవా 6-1, 4-6, 6-4తో తన దేశానికే చెందిన 19వ సీడ్ నాదియా పెత్రోవాను ఓడించింది.

2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌ను షరపోవా రెండు సెట్‌లలోనే ముగించాల్సింది. స్కోరు 6-1, 4-4తో ఉన్నదశలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. 73 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ కొనసాగింది. పెత్రోవా రెండు గేమ్‌లను నెగ్గి రెండో సెట్‌ను సాధించింది. ఆ తర్వాత మూడో సెట్‌లో 2-0తో విజయం సాధించింది.

ఇక మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-హలవకోవా (చెక్ రిపబ్లిక్) జోడి తమ ప్రత్యర్థికి 'వాకోవర్' ఇచ్చింది. లియాండర్ పేస్ (భారత్)-వెస్నినా (రష్యా) జోడి మూడో రౌండ్‌లో 4-6, 6-4, 10-5తో అబిగెల్ స్పియర్స్-స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో మూడో రౌండ్‌లో ఓడిపోయినా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సానియా-బెథానీ మాటెక్ (అమెరికా) జోడి 4-6, 7-6 (9/7), 3-6తో రెండో సీడ్ సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా-కొలిన్ ఫ్లెమింగ్ (బ్రిటన్) జంట 6-4, 7-6 (9/7)తో మెలానీ ఉడిన్-జాక్ సాక్ (అమెరికా) జోడిపై గెలిచింది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+