Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలంపిక్స్‌కు కల్మాడీ, ఎలా వెళ్తాడంటున్న మాకెన్

Suresh Kalmadi
న్యూఢిల్లీ, జులై 14: 2జీ స్కాంలో జైలు శిక్ష అనుభవించిన భారత్ ఒలంపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ లండన్ ఒలంపిక్స్ 2012లో పాల్గోనేందుకు గాను ఢిల్లీ హైకోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27 నుండి ఆగస్టు 13 వరకు అక్కడ పర్యటిచేందుకు ఢిల్లీ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి తల్వంత సింగ్ అనుమతిచ్చారు. లండన్ ఒలంపిక్స్‌కు వెళ్లేందుకు గాను రూ. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.

ఒలింపిక్స్ సందర్భంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ కౌన్సిల్ (ఐఏఏఎఫ్) ఏర్పాటు చేస్తున్న సదస్సులో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ కల్మాడీ గురువారం ఢిల్లీ కోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో.. దీనిపై కోర్టు తీర్పునిచ్చింది. ఇది ఇలా ఉంటే లండన్ ఒలంపిక్స్‌కు సురేష్ కల్మాడీకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర క్రీడల మంత్రి అజయ్ మాకెన్ తీవ్రంగా స్పందించారు. మాకెన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని ఆరోపణల నుంచి బయటపడే వరకూ కల్మాడీ లండన్‌ వెళ్తాడని తాను భావించడం లేదని అన్నారు.

ఆయన స్వచ్ఛందంగా వీటికి దూరంగా ఉండాలన్నారు. మరోవైపు ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడు వీకే మల్హోత్రాతో పాటు, క్లీన్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) కూడా కల్మాడీ లండన్ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆరోపణలన్నీ క్లియర్ అయ్యే వరకు అతను భారత బృందంతో వెళ్లకూడదని మల్హోత్రా అన్నారు. ఇలాంటి అంశాల్లో అసోసియేషన్ జోక్యం చేసుకునే వీలులేదన్నారు. భారత క్రీడా చరిత్రలో భారీ అవినీతికి పాల్పడిన వ్యక్తి ఒలింపిక్స్‌కు వెళ్లడం నిజంగా బాధాకరమైన అంశమని సీఎస్‌ఐ కన్వీనర్ బీవీపీ రావ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో అతను ఒలింపిక్స్‌కు వెళ్లడం వల్ల భారత్ విలువ తగ్గుతుందన్నారు.

2జీ కేసు స్కాంలో ఈ కేసులో మొదటి నిందితుడుగా ఉన్న కల్మాడీ అంతర్జాతీయ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ (ఐఎఎఎఫ్‌) కౌన్సిల్‌ సభ్యునిగా, ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (ఎఎఎ) అధ్యక్షునిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో లండన్‌ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన కోర్టుకు చూపడంతో లండన్ ఒలంపిక్స్‌కు వెళ్లేందుకు అనుమతిచ్చారు. ఒలింపిక్స్‌కి హాజరయ్యేందుకు లండన్ వస్తున్న కల్మాడీకి వసతి సౌకర్యాలు కల్పించొద్దని కేంద్ర క్రీడాశాఖ... ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ అసోసియేషన్(ఐఓఏ)ను కోరింది. ఈ మేరకు క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ కిడియా... ఐఓఏ సెక్రటరీ జనరల్ రణ్‌ధీర్ సింగ్‌కు లేఖ రాశారు.

నైతిక విలువలకు కట్టుబడి అతనికి ఎలాంటి సౌకర్యాలు కల్పించొద్దని, అవినీతి కేసుల నుంచి బయటపడే వరకు మద్దతివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ, వసతి సౌకర్యాలు, స్పాన్సర్‌షిప్‌లాంటి వాటిని కల్మాడీకి కల్పించొద్దు. ప్రారంభోత్సవ, ముగింపు కార్యక్రమాలకు, మ్యాచ్‌లకు సంబంధిం చిన టిక్కెట్లూ ఇవ్వొద్దు. ఈ విషయాన్ని అన్ని అంతర్జాతీయ సమాఖ్యల దృష్టికి తీసుకెళ్లండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో పాటు ముఖ్యంగా ఐఏఏఎఫ్‌తో చర్చించండి. ఒలింపిక్స్ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి, ఒలింపిక్ చార్టర్ ప్రకారం నడుచుకోండి అని లేఖలో పేర్కొన్నారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+