లండన్: భారత క్రీడాకారిణి మేరీ కోమ్ లండన్ ఒలింపిక్స్‌లో సంచలనం సృష్టించింది. భారతదేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. బాక్సింగ్ మహిళ ఫ్లై 51 కెజీల కెటగిరీలో ఆమె సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన లండన్ ఒలింపిక్స్ పోటీల్లో ఆమె ఈ విజయం సాధించింది. మేరీ కోమ్ టునీషియాకు చెందిన మరోవా రహాలీని 15-6 స్కోరుతో క్వార్టర్ ఫైనల్లో ఓడించింది.

మేరీ కోమ్ విజయంతో బాక్సింగ్ విభాగంలో ఖాతా తెరుచుకుంది. సెమీ ఫైనల్లో ఓడిపోయిన ఇద్దరు క్రీడాకారులకు కూడా కాంస్య పతకం ప్రదానం చేస్తారు. దీంతో మేరీ కోమ్‌కు పతకం ఖాయమైనట్లే. అయితే, ఆమె స్వర్ణ పతకం సాధించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
29 ఏళ్ల మేరీ కోమ్ తన ప్రత్యర్థిపై పూర్తిగా పైచేయి సాధించింది. నాలుగు రౌండ్లలో ఆమె 2,3,6,4 పాయింట్లు సాధించగా, రహాలీ 1,2,,2 పాయింట్లు సాధించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడో భారత మహిళగా మేరీ కామ్ రికార్డు నమోదు చేయనుంది. ఇంతకు ముందు కరణం మల్లీశ్వరి 2000లో సిడ్నీలో కాంస్య పతకం సాధించింది. సైనా నెహ్వాల్ ఈ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించింది.
విజయం ఉద్వేగపూరిత క్షణమని, తన కవల కుమారుల పుట్టుక రోజు ఈ విజయం దక్కిందని మేరీ కోమ్ ఆనందం వ్యక్తం చేసింది. పోలిష్ బాలిక చాలా బలమైందని, అయితే సాంకేతికంగా కాస్తా బలహీనురాలని, సాంకేతికంగా బాగుంటే ఆమెను ఎవరూ ఓడించలేరని, తన అనుభవం వల్లనే ఆమెను ఓడించానని మేరీ కోమ్ అన్నది.
బాక్సింగ్‌లో ఇది ఇండియా గొప్ప రోజు అని, అద్భుతమైన పాదాల కదలికతో తెలివిగా మేరీ కోమ్ వ్యవహరించిందని, స్కోర్ చేస్తూ కదలిందని భారత కోచ్ గుర్‌భక్ష్ సింగ్ చెప్పారు.